ఊరంతా.. ఖాతా!
నీటి కుంట.. పంటకు లాభమంట
ఫాంపాండ్ల తవ్వకంతో లాభాలు ఉన్నందున తవ్వకంపై రైతుల ఆసక్తి మేరకు వివిధ శాఖల అధికారులు ప్రోత్సహిస్తున్నారు.
వాతావరణ ం
జిల్లాలో ఆదివారం సాధారణ ఉష్ణోగ్రతలే నమోదవుతాయి. సాయంత్రం తర్వాత కొన్ని ప్రాంతాల్లో జల్లులు కురిసే అవకాశముంది.
ఆదివారం శ్రీ 18 శ్రీ మే శ్రీ 2025
8లో
సంపాదించిన సొమ్మంతా ఎప్పటికప్పుడు ఖర్చు చేస్తే ఆపద, అవసరాలకు ఇతరుల వద్ద చేయి చాచాల్సి వస్తుంది. ఒకవేళ ప్రైవేట్ సంస్థల్లో చీటీలు వేయాలన్నా, పొదుపు చేయాలన్నా భయం వెంటాడుతుంటుంది. అందుకే పోస్టాఫీస్, బ్యాంకుల్లో పొదుపు ఖాతాలు, డిపాజిట్లను అందుబాటులోకి
తీసుకొచ్చారు. అయితే, ప్రజలకు సరైన
అవగాహన లేక పోస్టాఫీసు సేవలను సద్వినియోగం చేసుకోవడం లేదు. కానీ ముదిగొండ మండలంలోని వల్లభి
గ్రామస్తులు మాత్రం అందుకు భిన్నంగా ముందుకు సాగుతూ పొదుపులో మేటిగా నిలుస్తుండడం విశేషం. – ముదిగొండ
లెక్కకు మిక్కిలిగా..
వల్లభి పోస్టాఫీస్‌లో రికరింగ్ డిపాజిట్లు(ఆర్‌డీ) 1,420 ఉన్నాయి. అలాగే, నిర్ణీత కాల పరిమితితో టైమ్ డిపాజిట్లు(టీడీ) 275, ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు ఖాతాలు(ఐపీపీబీ) వెయ్యి కొనసాగుతున్నాయి. ఇంకా జనరల్ పాలసీలు(జీఏపీ) 650, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్(పీఎల్‌ఐ) 25, గ్రామీణ తపాల బీమా(ఆర్‌పీఎల్‌ఐ) 700, సుకన్య సమృద్ధి యోజన 250తో పాటు ఎస్‌బీలు 300 ఉండడం విశేషం.
వల్లభి గ్రామ వాసులు 90శాతం మందికి చిన్న మొత్తాల పొదుపు ఖాతాలు ఉన్నాయి. పైసాపైసా కూడబెట్టుకున్న డబ్బును గ్రామ పోస్టాఫీస్‌లో వివిధ పథకాల ద్వారా పొదుపు చేస్తూ అవసరాలకు వాడుకుంటున్నారు. క్రమం తప్పకుండా ఖాతాదారులు చిన్న మొత్తాలు జమ వేసుకుంటుండగా.. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుండడంతో ఒకరిని చూసి ఇంకొకరు అన్నట్లుగా ఖాతాదారులు పెరిగారు. వల్లభిలోని పోస్టాఫీస్‌లో ప్రతీనెలా రూ.100 మొదలు రూ.2వేలు, రూ.5వేలు వరకు జమ చేస్తున్న వారు ఉన్నారు. పింఛన్‌దారులు, వ్యవసాయదారులు, ఉద్యోగులు, పేద, మధ్య తరగతి ప్రజలు ఇలా అన్ని వర్గాల వారు పొదుపు ఖాతాల్లో నగదు జమ చేసుకుంటున్నారు. రోజురోజుకు పెరుగుతున్న అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఆర్థిక స్థోమత పెంచుకోవడమే లక్ష్యంగా కష్టార్జితంగా సంపాదించిన సొమ్ములో కొంత మేర పొదుపు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఏడు వేల జనాభా
గ్రామంలో 7వేల జనాభా ఉండగా 1,500 గృహాలు, ఓటర్లు దాదాపు 4,700మంది ఉంటారు. జనాభాలో 90శాతం మందికి పోస్టాపీస్‌లో ఖాతాలు ఉండడం విశేషం. జిల్లాలోనే అత్యధిక ఖాతాలు కలిగిన పోస్టాఫీస్‌గా వల్లభి నిలుస్తోంది. ఇక ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంకు సేవలను వెయ్యి మంది సద్వినియోగం చేసుకుంటున్నారు. దీంతో పాటు టైమ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్(ఆర్‌డీ) ఖాతాదారులు ఉండగా.. తపాలా శాఖ ద్వారా వివిధ రకాల బీమా కూడా చేయించుకుంటున్నారు. పోస్టల్ ఉద్యోగులు ఖాతాదారులను ప్రోత్సహిస్తూ.. ఎప్పటికప్పుడు కొత్త పథకాలపై అవగాహన కల్పిస్తుండడంతో కొత్త ఖాతాలు పెరుగుతున్నాయి. బ్యాంకులతో పోలిస్తే నగదు జమ, విత్‌డ్రా సులువుగా ఉండడం, దూరం వెళ్లకుండా గ్రామంలోనే సేవలు అందుబాటులో ఉండడంతో జనం ఆసక్తి కనబరుస్తున్నారు.
పొదుపుపై ఆసక్తి...
గ్రామంలో ఒకరిని చూసి ఒకరు పొదుపునకు ముందుకొస్తున్నారు. దాదాపు అందరూ ఏదో ఖాతా తెరిచి డబ్బు జమ చేసుకుంటున్నారు. గ్రామస్తులకు పోస్టల్ పథకాలపై అవగాహన కల్పిస్తుండడంతో ఆసక్తి కనబరుస్తున్నారు.
– ఎస్.కే.జరీనా, బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్
నలుగురం పొదుపు చేస్తాం..
మా కుటుంబంలో నలుగురి పేరిట ఆర్‌డీలు కడుతున్నాం. చాలా కాలం నుంచి పొదుపు అలవాటుగా మారింది. అత్యవసర పరిస్థితిలో వాడుకుంటూ.. మళ్లీ డబ్బు ఉన్నప్పుడు జమ చేస్తాం. పొదుపుతో చాలా ఉపయోగాలు ఉన్నాయి.
– చేకూరి రామారావు
నెలకు రూ.2వేల జమ
పోస్టాఫీస్‌లో ప్రతీనెల రూ.2వేలు జమ చేస్తా. పిల్లల భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా సుకన్య సమృద్ధి యోజన పథకం ఖాతా తెరిచాను. పిల్లలు పెద్దయ్యే లోగా వారి చదువు, ఇతర ఖర్చులకు ఉపయోగపడతాయనే నమ్మకంఉంది. – సూరపల్లి ఎల్లమ్మ
పదేళ్ల నుంచి దాచుకుంటున్నా..
ప్రతీనెల ఆర్‌డీ కడుతున్నా. పింఛన్ సొమ్ములో కొంత మొత్తం పోస్టాఫీలో జమ చేస్తున్నా. ఎప్పుడు అవసరం వచ్చినా తీసుకోవడం పోస్టాఫీస్‌లోనైతేనే వీలుగా ఉంటుంది. అన్ని అవసరాలకు డబ్బే ప్రధానమని పదేళ్లు నుంచి జమ చేసుకుంటున్నా. – ఎనిక భద్రమ్మ
న్యూస్‌రీల్
పోస్టల్ అకౌంట్లలో వల్లభి ముందంజ
పొదుపు బాటలో 90శాతం గ్రామస్తులు
అత్యధిక ఖాతాలతో జిల్లాలో
అగ్రస్థానం
ఊరంతా.. ఖాతా!
ఊరంతా.. ఖాతా!
ఊరంతా.. ఖాతా!
ఊరంతా.. ఖాతా!
ఊరంతా.. ఖాతా!
ఊరంతా.. ఖాతా!


