మృత్యుఘంటికలు | - | Sakshi
Sakshi News home page

మృత్యుఘంటికలు

Nov 21 2026 2:44 AM | Updated on Nov 21 2026 2:44 AM

అధిక రోడ్డు ప్రమాదాలకు అతివేగం, మద్యం తాగి డ్రైవింగ్‌ చేయడం, వాహనాల నిర్వహణలో లోపం, డ్రైవర్ల అలసటతో సంభవిస్తున్నాయి. వాహనదారులు డబ్బు ఆదా చేయడానికి వాహనాల టైర్లు మార్చడం లేదా టైర్లు పునర్వివినియోగం చేయడంతో టైర్లు ఒత్తిడిని నిర్లక్ష్యం చేయడంతో రోడ్లలో నిలిచిన నీరు కనబడదు. దీంతో వాహనాలు జారే అవకాశం ఉంటుందని సీనియర్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారి తెలిపారు. గంటకు 60 కిలోమీటర్ల వేగంలో వెళితే చాలా వరకు ప్రమాదాలను తప్పించవచ్చు. కానీ కొందరు మాత్రమే దీనిని అనుసరిస్తారన్నారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు గల అవధి ప్రాణాంతక రోడ్డు ప్రమాదాల సమయం. ఈ సమయంలో డ్రైవర్లు విపరీతమైన అలసటతో వాహనాలు నడుపుతుంటారని తెలిపారు.

బనశంకరి: రాష్ట్రంలో రోడ్డు భద్రత పెను సవాలు విసురుతోంది. ప్రతియేటా రోడ్డు ప్రమాదాల్లో 11 వేల మంది మృత్యువాత పడుతున్నారు. ట్రాఫిక్‌, రోడ్డు భద్రతా శాఖ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో (బెంగళూరు మినహా) రోడ్డు ప్రమాదాల సంఖ్య 2021లో 31,434 నుంచి 2025 నాటికి 37,682 మందికి చేరుకోగా 20 శాతం పెరిగింది. మరణాల సంఖ్య 9,384 నుంచి 11,344 మందికి చేరుకుంది. 21 శాతం పెరుగుదల కనిపిస్తోంది. 2023లో రాష్ట్రంలో 38,466 ప్రమాదాలు సంభవించగా వాటిలో 11,406 మంది మృతి చెందారు. 2024లో 38,293 ప్రమాదాలు సంభవించగా 11,496 మంది మృత్యువాత పడ్డారు. గత ఐదేళ్లులో నమోదైన అత్యధిక మరణాల సంఖ్య ఇదే కావడం విశేషం. 2025లో మృతుల సంఖ్య 11,344 కు స్వల్పంగా తగ్గినప్పటికీ గాయపడిన వారి సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉంది. 2021లో 37,934 మంది క్షతగాత్రులు ఉండగా 2025 నాటికి 49,305కు చేరుకుంది. 2026లో 9 నెలల గణాంకాల ప్రకారం 29,809 ప్రమాదాలు సంభవించగా, వీటిలో 8,048 మంది మృతి చెందారు. 37,289 మంది గాయాల పాలయ్యారు.

ఏటా సగటున 4,447 ప్రమాదాలు

2021 నుంచి 2025 మధ్య బెంగళూరులో ప్రతి ఏటా సగటున 4,447 ప్రమాదాలు సంభవించగా, వీరిలో 847 మంది మృత్యువాత పడ్డారు. పెచ్చుమీరుతున్న ప్రమాదాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి రహదారి మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. రాష్ట్ర రహదారులు అనేక సవాళ్లు విసురుతుండగా ఇవి పట్టణాలు, గ్రామాల గుండా వెళుతుండటం, అక్కడ బైకులు, ట్రాక్టర్లు, బస్సులు, పాదచారులతో కూడిన వివిధ రకాల ట్రాఫిక్‌ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడళ్లు, మలుపులు, రహదారి పక్కన జరిగే కార్యకలాపాలు ప్రమాదాలను పెంచుతున్నాయని రాష్ట్ర పోలీస్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఎంఏ.సలీం అన్నారు. జాతీయ రహదారులపై భద్రతను మెరుగుపరిచేందుకు రాష్ట్ర పోలీసులు, ప్రజా పనుల శాఖ, రవాణా శాఖ, భారతీయ జాతీయ రహదారుల ప్రాధికార, స్థానిక సంస్థలతో కలిసి పని చేస్తున్నారని తెలిపారు.

రోడ్డు భద్రతా కమిటీలతో పర్యవేక్షణ

మేము ప్రతి జిల్లాల్లో రాష్ట్ర రహదారులపై ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలను, బ్లాక్‌స్పాట్స్‌ను గుర్తించామని, సిగ్నల్స్‌, రంబుల్‌స్ట్రిప్స్‌, రోడ్డు మార్కింగ్‌లు, జంక్షన్ల పెరుగుదల వంటి ఇంజనీరింగ్‌ చర్యలను త్వరితగతిన చేపట్టేందుకు వీలుగా ఈ సమాచారాన్ని రోడ్ల యాజమాన్య సంస్థలతో పంచుకుంటున్నామన్నారు. జిల్లాకలెక్టర్‌ నేతృత్వంలో జిల్లారోడ్డు భద్రతా కమిటీలు పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షిస్తున్నాయని తెలిపారు. పోలీసులకు హైవేలకు ఇంటెలిజెంట్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్‌, ఏఐ ఆధారిత కెమెరా నిఘా వ్యవస్థను విస్తరిస్తున్నారని ఆయన అన్నారు. అతివేగం, మద్యం తాగి, అడ్డదిడ్డంగా వాహనాలు నడపడం, హెల్మెట్లు, సీట్‌ బెల్టులు ధరించకపోవడం వంటి ప్రాణనష్టానికి దారితీసే ఉల్లంఘనలపై దృష్టి సారిస్తున్నామని తెలిపారు. ప్రమాదాల్లో గాయపడిన వారిని గోల్డెన్‌ అవర్‌ సమయంలో ఆసుపత్రులకు తరలించేందుకు వీలుగా ప్రధాన రాష్ట్ర రహదారి మార్గాలపై గస్తీని పెంచుతున్నామన్నారు.

ప్రమాదాలకు అతివేగం, అలసట కారణం

పెచ్చుమీరుతున్న రోడ్డు ప్రమాదాలు

ప్రతి యేటా 11 వేల మంది దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement