దంపతులను ఢీకొన్న లారీ | - | Sakshi
Sakshi News home page

దంపతులను ఢీకొన్న లారీ

Nov 21 2026 2:44 AM | Updated on Nov 21 2026 2:44 AM

దొడ్డబళ్లాపురం: హిట్‌ అండ్‌ రన్‌కి మహిళ బలైన సంఘటన నెలమంగల తాలూకా ఎడెహళ్లి వద్ద చోటుచేసుకుంది. బెంగళూరు లగ్గెరె నివాసి వీణాబాయి(38) తన భర్త శివాజీరావ్‌తో కలిసి గురువారం రాత్రి బైక్‌పై సమీపంలోని సిద్ధగంగా మఠానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఎడెహళ్లి వద్ద లారీ ఢీకొంది. ప్రమాదంలో కిందపడ్డ వీణ మీదుగా చక్రాలు దూసుకెళ్లి అక్కడికక్కడే మృతిచెందింది. భర్త శివాజీరావ్‌ తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ వాహనం నిలపకుండా పరారయ్యాడు. నెలమంగల పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.

గతంలో కిడ్నీ ఇచ్చి

బతికించుకున్న భర్త

కాగా వీణాకు ఆరేళ్ల క్రితం లోబీపీ వల్ల రెండు కిడ్నీలు విఫలం కావడంతో భర్త తన కిడ్నీ ఇచ్చి బతికించుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కిడ్నీ ఇచ్చి పునర్జన్మ ఇచ్చినా భార్య ఇంత త్వరగా కళ్లముందే మృతిచెందడంతో భర్త శివాజీరావ్‌ కన్నీటిపర్యంతమయ్యాడు.

భార్య మృతి, భర్తకు తీవ్ర గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement