విద్యార్థిని అపహరణ | - | Sakshi
Sakshi News home page

విద్యార్థిని అపహరణ

Nov 21 2026 2:44 AM | Updated on Nov 21 2026 2:44 AM

యశవంతపుర: పట్టపగలే కాలేజీ ఆవరణలో విద్యార్థినిని అపహరించిన ఘటన దక్షిణకన్నడ జిల్లా మంగళూరులో జరిగింది. థార్‌ జీపులో ఎక్కించుకుని పారిపోయారు. అపహరణ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. ముస్లిం సముదాయానికి చెందిన అపహరణకు గురైన విద్యార్థిని మంగళూరులో మెడిసిన్‌ చదువుతోంది. హిందూ యుకుడిని ప్రేమిస్తున్నందుకు కుటుంబ సభ్యులే కాలేజీ ఆవరణలోకి దౌర్జన్యంగా వెళ్లి థార్‌ జీపులో ఎక్కించుకుని పారిపోయినట్లు ఆరోపణలున్నాయి. విద్యార్థినిని బలవంతంగా కారులో ఎక్కించుకుని పారిపోతున్న వీడియో దక్షిణకన్నడ జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం కల్గిస్తోంది. ఘటనకు సంబఽంధించి విచారణ చేయాలని మంగళూరు పోలీసు కమిషనర్‌ సుధీర్‌కుమార్‌ రెడ్డి ఆదేశించారు. తక్షణం రంగంలోకి దిగిన పోలీసులు విద్యార్థిని కోసం గాలింపు చేపట్టారు. అయితే నగరంలో నుంచి బయటకు వెళ్లడానికి ముందుగానే పోలీసులు జీపును అడ్డగించి విద్యార్థినిని రక్షించే ప్రయత్నం చేయలేదనే ఆరోపణలున్నాయి. జీపును కాలేజీ ఆవరణలోకి ఎలా అనుమతించారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీ

సేవలకు పచ్చజెండా

● రాష్ట్ర ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

శివాజీనగర: రాష్ట్ర వ్యాప్తంగా బైక్‌ ట్యాక్సీ సేవలను నిర్వహించడానికి అనుమతిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ కర్ణాటక ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ, జస్టిస్‌ కోటేశ్వర్‌ సింగ్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వును జారీ చేసింది. దీంతో కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీ సేవలను అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వు ఎలాంటి అంతరాయం లేకుండా అమలవుతుంది.

కేసు పూర్తి నేపథ్యం ఏంటి?

బైక్‌ ట్యాక్సీ ఆపరేటర్ల సేవలను నిలిపివేయాలని జారీ చేసిన మునుపటి ఉత్తర్వును రద్దు చేయడమే రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ విధానం కాగా, అప్పటి ప్రధాన న్యాయమూర్తి విభా బఖ్రు, జస్టిస్‌ సీ.ఎం.జోషిలతో కూడిన కర్ణాటక హైకోర్టు డివిజన్‌ బెంచ్‌, బైక్‌ ట్యాక్సీ ఆపరేటర్లు తమ సేవలను నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వును రద్దు చేస్తూ 2026 జనవరి 23న తీర్పును వెలువరించింది. ఈ తీర్పే వివాదానికి నాంది పలికింది. ఓలా, ఉబర్‌, రాపిడో వంటి అగ్రిగేటర్‌ కంపెనీలు, మోటార్‌ సైకిల్‌ యజమానులు, బైక్‌ టాక్సీ సంక్షేమ సంఘం దాఖలు చేసిన అప్పీళ్లను హైకోర్టు సమర్థించింది. రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణ అవసరాలకు లోబడి మోటార్‌ సైకిళ్లను రవాణా వాహనంగా నమోదు చేసుకోవచ్చని, కాంట్రాక్ట్‌ క్యారేజ్‌లుగా నడపవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.

చెరకుకు మద్దతు ధర కోసం ప్రధానికి లేఖ

మండ్య: టన్ను చెరకుకు కనీసం రూ.4,500 ధర నిర్ణయించాలని డిమాండ్‌ చేస్తూ మండ్య రక్షణ వేదిక కార్యకర్తలు చెరకు ముక్కలతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖను పంపారు. మండ్య జిల్లాలోని శ్రీరంగపట్టణలోని ప్రొఫెషనల్‌ కొరియర్స్‌ సమీపంలో గుమిగూడిన మండ్య రక్షణ వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వ్యవస్థాపక అధ్యక్షుడు శంకర్‌ బాబు మాట్లాడుతూ పొరుగు రాష్ట్రాల్లో చెరకుకు మంచి ధర లభిస్తుంటే, కర్ణాటకలో సరైన ధర ఇవ్వకుండా వివక్షాపూరిత విధానాన్ని అనుసరిస్తున్నారని మండిపడ్డారు. టన్ను చెరకుకు గరిష్టంగా పొందగలిగే ధర రూ.7వేలు కాగా కనీసం రూ.4,500 ఇవ్వాలని కోరుతున్నా ఇవ్వడం లేదన్నారు. ప్రధానమంత్రి తక్షణమే జోక్యం చేసుకుని టన్నుకు కనీస ధరను రూ.4,500గా నిర్ణయించాలని లేఖ రాసి కొరియర్‌ ద్వారా పంపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement