బీఎంసీఆర్‌సీలో మళ్లీ రేడియోథెరపీ సేవలు | - | Sakshi
Sakshi News home page

బీఎంసీఆర్‌సీలో మళ్లీ రేడియోథెరపీ సేవలు

Oct 13 2026 1:17 AM | Updated on Oct 13 2026 1:17 AM

సాక్షి,బళ్లారి: నగరంలో పేరుగాంచిన బీఎంసీఆర్‌సీ(బళ్లారి వైద్య కళాశాల పరిశోధన సంస్థ) ఆస్పత్రిలో క్యాన్సర్‌ రోగులకు రేడియోథెరపీ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఇటీవల బీఎంసీఆర్‌సీ ఆస్పత్రిలో క్యాన్సర్‌ రోగులకు రేడియోథెరపీ సేవలు నిలిపివేయడంతో క్యాన్సర్‌ రోగులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఈనేపథ్యంలో సామాజిక కార్యకర్త వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కూడా చేపట్టారు. రోగులు పడుతున్న ఇబ్బందులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆస్పత్రి డైరెక్టర్‌ మరిరాజ్‌ పెద్దాస్పత్రిలో క్యాన్సర్‌ రోగులకు రేడియోథెరపీ సేవలను తిరిగి అందుబాటులోకి తెచ్చారు. ఎంతో అధునాతమైన మిషన్‌ను అమర్చడంతో రోగులకు వరంగా మారింది. ఈసందర్భంగా క్యాన్సర్‌ రోగులు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంటచుకుని వెంటనే రేడియోథెరపీ మిషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన ఆస్పత్రి డైరెక్టర్‌ మరిరాజ్‌ను సోమవారం సామాజిక కార్యకర్త ఆధ్వర్యంలో పలువురు సభ్యులు అభినందించారు. కాగా బెంగళూరు తరహాలో అన్ని రకాల వైద్య సేవలు అందించేందుకు నూతనంగా నిర్మించిన సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో గుండెకు సంబంధించిన చికిత్సలు మాత్రమే చేస్తున్నారని, ఇది శుభపరిణామమే అయినా మిగిలిన వ్యాధులకు సంబంధించిన చికిత్సలు, ఆపరేషన్లు అందించడానికి అన్ని చర్యలు తీసుకోవాలని కోరారు.

క్యానర్స్‌ వ్యాధిగ్రస్తులకు వరంగా పెద్దాస్పత్రి

డైరెక్టర్‌కు సామాజిక కార్యకర్తల అభినందన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement