ఓటు హక్కును కాపాడాలని నిరసన | - | Sakshi
Sakshi News home page

ఓటు హక్కును కాపాడాలని నిరసన

Oct 29 2026 1:42 AM | Updated on Oct 29 2026 1:42 AM

బళ్లారి అర్బన్‌: భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను, ప్రజల ఓటు హక్కును కాపాడాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో మానవహారం నిర్వహించారు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ తక్షణమే రాజీనామా చేయాలని, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియను రద్దు చేయాలని సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. సర్‌ ద్వారా ఓటర్ల పేర్లు తొలగించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా నుంచి అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సీపీఐ బళ్లారి కార్యదర్శి ఆదిమూర్తి, చెన్నప్ప, సంయుక్త కార్యదర్శి కట్టెబసప్ప, బళ్లారి తాలూకా కార్యదర్శి ఎస్‌ఆర్‌.ముదుకప్పతో పాటు గురుమూర్తి, పరశురాం, బసవనగౌడ, ముక్కన్న, కరిబసప్ప, ఉమేష్‌, మల్లప్ప, ఈరన్న, నాగరాజ్‌, రవీంద్ర, మారేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement