అప్పుల బాధతో రైతుల ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

అప్పుల బాధతో రైతుల ఆత్మహత్య

Oct 29 2026 1:24 AM | Updated on Oct 29 2026 1:24 AM

రాయచూరు రూరల్‌: అప్పుల బాధతో వేర్వేరు చోట్ల ఇద్దరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వివరాలు.. తాను చేసిన అప్పులను తీర్చే మార్గం కానరాక, అప్పులిచ్చిన వారి వేధింపులు భరించలేక ఓ రైతు రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడిన ఘటన యాదగిరి జిల్లాలో చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి కౌళూరు నివాసి సాబరెడ్డి పాటేదార్‌(29) సోలాపూర్‌–యశవంతపూర్‌ రైలు కింద పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

ధార్వాడ జిల్లాలో..

హుబ్లీ: అప్పుల బాధ తాళలేక రైతన్న ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన ధార్వాడ జిల్లా నవలగుంద తాలూకా నాగనూర గ్రామంలో చోటు చేసుకుంది. మక్దుంసాబ్‌(46) మృతుడు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. 4 ఎకరాల 20 గుంట్ల సాగుభూమి ఉంది. పంటల సాగు కోసం బ్యాంక్‌తో పాటు వివిధ చోట్ల అప్పులు చేశారు. కరువుతో అప్పులు తీర్చే మార్గం కానరాక మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడని ఆయన భార్య నవలగుంద పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement