బళ్లారిఅర్బన్: రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని నివారించేందుకు నవంబర్ 2 నుంచి జిల్లాలో హెల్మెట్ ధారణ తప్పనిసరి చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ సుమన్ డీ.పన్నేకర్ తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని, మైనర్లు వాహనాలు నడపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలను పరిశీలించగా, అనేక ఘటనల్లో హెల్మెట్లు ధరించక పోవడం వల్ల తలకు తీవ్ర గాయాలై పలువురు మృతి చెందినట్లు వెల్లడైందని ఎస్పీ పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వాహనదారులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలని సూచించారు. హెల్మెట్ తప్పనిసరి నిబంధనను కట్టుదిట్టంగా అమలు చేయడంపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు. హెల్మెట్ ధరించని ద్విచక్ర వాహనదారులతో పాటు మైనర్లు వాహనాలను నడిపితే వారి తల్లిదండ్రులపై కూడా నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
మైనర్లు వాహనం నడిపితే చర్యలు
జిల్లా ఎస్పీ సుమన్ డీ.పన్నేకర్


