దొడ్డబళ్లాపురం: టాటాఏస్ ఆటో బైక్‌ను ఢీకొన్న ప్రమాదంలో దంపతులు, బంధువు దుర్మరణం చెందిన సంఘటన బెళగావి జిల్లా చెన్నమ్మకిత్తూరు తాలూకా దేమట్టి–మల్లాపుర మార్గంలో జరిగింది. మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ధారవాడ తాలూకా హెగ్గేరి గ్రామానికి చెందిన ఆజాద్ ఇస్మాయిల్(45), ఇతడి భార్య కై రూన్ (40), వీరి అల్లుడు నిసార్ అహ్మద్ (16) చనిపోయారు. దేమట్టి గ్రామం నుంచి హెగ్గేరికి బైక్‌పై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన టాటాఏస్ ఆటో ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని ఆస్పత్రులకు తరలించినప్పటికీ చికిత్స ఫలించక మృతిచెందారు. కిత్తూరు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
బెంగళూరు మహిళలకు సేఫ్
● పోలీసు కమిషనర్
బనశంకరి: మహిళల భద్రతలో దేశంలోనే బెంగళూరు మొదటిస్థానంలో ఉందని, ప్రపంచంలో 17 స్థానంలో ఉందని నగర పోలీస్ కమిషనర్ సీమంత్‌కుమార్‌సింగ్ తెలిపారు. బుధవారం నగరంలోని ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ కేంద్రంలో నేషనల్ లా స్కూల్ ఏర్పాటుచేసిన సదస్సులో ఆయన మాట్లాడారు. బెంగళూరులో దేశ విదేశాల నుంచి ఉద్యోగాల కోసం లక్షలాది మంది మహిళలు నివాసం ఉంటున్నారు. అర్ధరాత్రి వరకు విధులు నిర్వహించి ఇళ్లకు వెళుతున్నారు, నిర్భయంగా జీవిస్తున్నారు అని చెప్పారు. అత్యవసర వేళల్లో డయల్ 112 కు ఫోన్ చేస్తే 15 నిమిషాల్లో పోలీసులు వచ్చేవారు, ఇప్పుడు 6.30 నిమిషాల్లోనే ఘటనాస్థలానికి చేరుకునే వ్యవస్థ ఉందని తెలిపారు. అత్యవసర ఫోన్‌కాల్స్‌కు ఇతర యాప్‌లను రూపొందించామని, ఏడాదిలో 20 వేల సిబ్బందికి శిక్షణ అందించామని తెలిపారు. బెంగళూరులో జరుగుతున్న పోలీస్ శిక్షణ గురించి తెలుసుకోవడానికి వివిధ రాష్ట్రాలకు చెందిన సీనియర్ పోలీస్ అధికారులు వచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ ఎంఏ.సలీం, సుధీర్ కృష్ణస్వామి, వివిధ రంగాల ప్రతినిధులు పాల్గొన్నారు.


