కృష్ణరాజపురం: బెంగళూరు మెట్రో రైలు తరచూ పోకిరీల ఆగడాలు వెలుగుచూస్తున్నాయి. ఓ వ్యక్తి తనను రహస్యంగా వీడియో చిత్రీకరించాడని ఒక యువతి ఫిర్యాదు చేసింది. మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు తనకు చేదు అనుభవం ఎదురైందంటూ ఆ యువతి ఇన్‌స్టాలో వీడియోను పోస్టు చేసింది.
ఏం జరిగిందంటే..
వైట్‌ఫీల్డ్ మార్గంలో మెట్రో రైలులో వెళ్తుండగా ఓ యువకుడు మొబైల్‌తో తనను చిత్రీకరించడం గమనించిన అతన్ని అడ్డుకుని ఫోన్ లాక్కున్నట్లు తెలిపింది. అన్‌లాక్ చేసి ఇవ్వాలని కోరగా అతడు ఒప్పుకోలేదని, రైలు దిగి లిఫ్టు వైపుగా వెళ్లే సమయంలో వాగ్వాదం జరిగిందని తెలిపింది. క్షమించండి అని అతడు అంటూనే ఆ తర్వాత మెట్రో స్టేషన్‌కు చేరుకోగానే భద్రత సిబ్బంది ముందే యువతి చేతిలోని తన మొబైల్‌ను లాక్కొని అక్కడి నుంచి పారిపోయాడు. తాను మంచి దుస్తులే వేసుకున్నానని తెలిపింది. యువతి కాడుగోడి పోలీసు స్టేషన్‌కు చేరుకుని కేసు పెట్టగా పోకిరీ కోసం గాలింపు చేపట్టారు.
ఇన్‌స్టాలో యువతి ఆవేదన


