2 సీట్లు వస్తాయనుకున్నాం | - | Sakshi
Sakshi News home page

2 సీట్లు వస్తాయనుకున్నాం

Oct 29 2026 1:18 AM | Updated on Oct 29 2026 1:18 AM

● సరిదిద్దుకుంటాం: సీఎం డీకే శివ

బనశంకరి: విధానపరిషత్‌ ఎన్నికల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పును క్షుణ్ణంగా అధ్యయనం చేసి సరిదిద్దుకుంటామని సీఎం డీకే.శివకుమార్‌ తెలిపారు. బుధవారం బెంగళూరులో సదాశివనగర నివాసం వద్ద విలేకరులతో మాట్లాడారు. ఉపాధ్యాయ, పట్టభద్ర క్షేత్రాల్లో ఓటర్లు ఇచ్చిన తీర్పును గౌరవంతో స్వీకరిస్తామన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రెండు సీట్లు గెలుస్తుందని ధీమా ఉండగా గెలుపొందలేకపోయామని, ఓడిపోయినా ఓట్లు సాధించామని, బెంగళూరు ఉపాధ్యాయ క్షేత్రం ఫలితం ఊహించలేదని చెప్పారు. బీజేపీ–జేడీఎస్‌ భవిష్యత్‌ కు ఈ ఫలితాలు నాంది అంటున్నారని, గతంలో చెన్నపట్టణ, శిగ్గావి ఉప ఎన్నికల్లో ఓడిపోయారు, దీనికి ఏమి సమాధానం ఇస్తారని, అది కూడా ముందస్తు సూచన కాదా అని ప్రశ్నించారు. బ్యాలెట్‌ ద్వారానే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయని, కానీ కాంగ్రెస్‌ ఓడిపోయిందనే బీజేపీ నేతల విమర్శలను ప్రస్తావించగా, బ్యాలెట్‌ ద్వారానే ఎన్నికలు జరపాలని సీఎం చెప్పారు. ఎన్నికల ప్రక్రియలో అనేక సమస్యలు ఉన్నాయి, నవంబరు తరువాత తమ పార్టీలో దీని గురించి చర్చిస్తామన్నారు.

త్వరలో రైతుల ఖాతాలకు డబ్బులు

కరువు రైతులకు పరిహారం విడుదలపై ప్రశ్నించగా, వారి బ్యాంకు అకౌంట్లను పరిశీలిస్తున్నామని సీఎం డీకే చెప్పారు. ఇప్పటికే ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని తెలిపారు. లోపాలను సరిదిద్ది అకౌంట్లకు పరిహారం జమ చేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement