రాయచూరు రూరల్: ఈశాన్య ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి శశీల్ నమోిషి విజయం సాధించారు. ఈశాన్య ఉపాధ్యాయ ఎమ్మెల్సీ(కలబుర్గి) నియోజకవర్గంలో శుక్రవారం ఓటింగ్ జరగగా, మంగళవారం ఓట్ల లెక్కింపు జరిగింది. కలబుర్గి విశ్వవిద్యాలయం గణిత భాస్కర భవనంలో కళ్యాణ కర్ణాటక పరిధిలో కలబుర్గి, యాదగిరి, రాయచూరు, కొప్పళ, బీదర్, బళ్లారి, విజయనగర జిల్లాల్లోని ఓట్లను లెక్కించారు. ఈశాన్య ఉపాధ్యాయ నియోజకవర్గంలో ప్రధానంగా బీజేపీ అభ్యర్థి శశీల్ నమోషికి 15,496 ఓట్లు పడగా, కాంగ్రెస్ అభ్యర్థి శరణప్ప మట్టూరుకు 12,299 ఓట్లు మాత్రమే పడడంతో 3,197 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు కేంద్రంలో కలబుర్గి డివిజనల్ కమిషనర్ జహీరా నసీం విజేత శశీల్ నమోషికి ప్రమాణ పత్రాన్ని అందించారు.


