సర్కారు బడుల్ని కాపాడుకుందాం | - | Sakshi
Sakshi News home page

సర్కారు బడుల్ని కాపాడుకుందాం

Sep 8 2026 12:11 AM | Updated on Sep 8 2026 12:11 AM

రాయచూరు రూరల్‌: ప్రభుత్వ పాఠశాలలను సంరక్షించడం మనందరి బాధ్యత అని ఎస్‌డీఎంసీ అధ్యక్షుడు జయణ్ణ పేర్కొన్నారు. సోమవారం విజ్ఞాన కేంద్రంలో స్వామి వివేకానంద, ప్రభుత్వ పాఠశాల వేదిక, భారత జ్ఞాన విజ్ఞాన సమితి, ఎల్‌ఐసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. రాయచూరు జిల్లాను ఆస్ప్రియేషన్‌ జిల్లాగా ప్రకటించడంతో ఎస్‌డీఎంసీల సహకారంతో విద్యా రంగానికి ప్రాధాన్యత కల్పించాలన్నారు. ఇంటిలో విద్య కేవలం సంస్కారం, సంప్రదాయాలు, ఆచార విచారాలతో పాటు పాఠశాలల్లో లభించే విద్య జీవన ప్రమాణాలను పెంచుతుందని అభిప్రాయపడ్డారు. మన పాఠశాల, మన హక్కు లక్ష్యాన్ని సాధించాలన్నారు. సమావేశంలో నిరంజనారాధ్య, విరుపమ్మ, సురేష్‌ స్వామి, దేవరాజ్‌, హఫీజుల్లా, కృష్ణ, చంద్రశేఖర్‌రెడ్డి, సువర్ణలున్నారు.

ఆర్టికల్‌ అమలు

చేయాలని ధర్నా

రాయచూరు రూరల్‌: కళ్యాణ కర్ణాటకలోని ఏడు జిల్లాల్లో రాజ్యాంగంలోని ఆర్టికల్‌– 371(జే)ను అమలు చేయాలని కళ్యాణ కర్ణాటక పోరాట సమితి సభ్యులు డిమాండ్‌ చేశారు. సోమవారం టిప్పుసుల్తాన్‌ ఉద్యానవనంలో చేపట్టిన ఆందోళనలో అధ్యక్షుడు బసవరాజ్‌ మాట్లాడుతూ కేంద్రం ఆర్టికల్‌ను జారీ చేసి దశాబ్దాలు గడిచినా దానిని సక్రమంగా అమలు చేయడంలో అధికారులు నిరాసక్తతను ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. ఆందోళనలో చామరస మాలి పాటిల్‌, కరియప్ప, చంద్రశేఖర్‌, అమరేష్‌, విద్యా పాటిల్‌ తదితరులున్నారు.

ఖైదీలకు సంగీత శ్రవణం అవసరం

రాయచూరు రూరల్‌: జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు మానసికంగా ప్రవర్ధమానులై సమాజంలో శాంతియుతంగా కుటుంబ జీవితం గడపడానికి సంగీత రస మంజరి అవసరమని సినీ నటి పూజా పేర్కొన్నారు. ఆదివారం రాత్రి జిల్లా జైలులో కలా సంకుల సంస్థ ఏర్పాటు చేసిన సంగీతోత్సవ కార్యక్రమంలో ఖైదీలనుద్దేశించి మాట్లాడారు. శిక్షలు అనుభివించే ఖైదీలు భవిష్యత్తులో జీవితాలను మార్చుకొని సమాజంలో మంచి పేరు తెచ్చుకోడానికి సంగీత శ్రవణం సహకరిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా జైలర్‌ అనితా హిరేమని, జైల్‌ అధికారులు, శ్యాం ఖానాపూర్‌లున్నారు.

బాధిత కుటుంబానికి పరామర్శ

రాయచూరు రూరల్‌: జిల్లాలోని సిరవార తాలూకా హొక్రాణిలో దళిత యువతి అశ్వినిపై హత్యాచారానికి పాల్పడిన నిందితులను అరెస్ట్‌ చేయడంతో పాటు కేసును నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని కర్ణాటక న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు అరుణ్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. సోమవారం అశ్విని కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి మాట్లాడారు. జిల్లాలో భూమానంద, రేణుక, రమేష్‌ మృతి చెంది నెల రోజులు కావస్తున్నా రాష్ట్ర హోం శాఖ మంత్రి ప్రియాంక్‌ ఖర్గేకు దళితుల ఇళ్లలో చావులపై కనికరం లేకపోయిందని వాపోయారు. హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఖర్గే కలబుర్గికి మంత్రా లేక రాష్ట్రాినికి మంత్రా, ఏసీ గదుల్లో కూర్చొని కాలయాపన చేయడం తగదన్నారు. హత్యలకు కారకులపై చర్యలు చేపట్టాలని ఒత్తిడి చేశారు.

రౌడీషీటర్‌పై కేసు

హుబ్లీ: రోడ్డుపై తెల్లరంగు పౌడర్‌ పెట్టి దానిపై ప్లాస్టిక్‌ కవర్‌లో ఉన్న ఏదో లిక్విడ్‌ వేసి నిప్పంటించి పేల్చేసి వీడియో వైరల్‌ చేసిన రౌడీషీటర్‌పై కేసు నమోదైంది. హుబ్లీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో రౌడీషీటర్‌ మహమ్మద్‌ ఉజైఫ్‌ హుబ్లీ కులకర్ణి అక్కలద రోడ్డులో పేలుడు వస్తువును రవాణా చేస్తూ రోడ్డుపై పేల్చిన ఆరోపణలపై కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement