ఎంపికై న ఏనుగులు
మైసూరు: ప్రపంచ ప్రసిద్ధ మైసూరు దసరా కోసం మైసూరు జిల్లా యంత్రాంగం ఘనంగా ఏర్పాట్లు చేస్తుండగా, మరోవైపు యదువంశ రాజవంశం ప్రైవేట్ దసరా ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు సన్నాహాలు ప్రారంభించింది. మైసూరు రాజమాత ప్రమోదాదేవి ఒడెయర్ కుటుంబం తమ ధార్మిక వేడుకల కోసం శ్రీకంఠ, ఏకలవ్య ఏనుగులను ఎంపిక చేసింది. నవరాత్రి పండుగ అయిన దసరా సమయంలో, ధార్మిక ప్రాముఖ్యత కలిగిన బంగారు సింహాసనాన్ని పూజించడం, సింహాసనాన్ని అధిరోహించడం, ప్రైవేట్ దర్బారును నిర్వహించడం యదువీర్ శ్రీకంఠ దత్త నరసింహరాజ ఒడెయర్ రాజకుటుంబానికి కొనసాగుతున్న సంప్రదాయం. దీనికి అదనంగా నవరాత్రుల సమయంలో తొమ్మిది రోజుల పాటు రాజభవనంలోని రాజకుటుంబం ఉదయం, సాయంత్రం ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంది. ఆ సమయంలో దసరాకు వచ్చే గజరాజుల నుంచి మగ ఏనుగును పట్టపుటేనుగుగా ఎంచుకోవడం ఆనవాయితీ.
శ్రీకంఠ, ఏకలవ్య ఏనుగుల ఎంపిక


