కోలారు : పాత్రికేయులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి అవసరమైన భూమిని మంజూరు చేయిస్తామని ఎమ్మెల్యే కొత్తూరు మంజునాథ్ తెలిపారు. పాత్రికేయుల భవనంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సహకార సంఘ సభ్యుల ప్రథమ వార్షిక మహాసభను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పాత్రికేయుల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన భూమిని మంజూరు చేయడం ద్వారా పాత్రికేయులకు న్యాయం చేస్తామన్నారు. ప్రస్తుత పాత్రికేయుల భవనాన్ని నవీకరిస్తామన్నారు. కలెక్టర్ రవికుమార్ మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారంలో పత్రికల పాత్ర అమోఘమన్నారు. ఎమ్మెల్సీ అనిల్‌కుమార్, సమాజ సేవకుడు సిఎంర్ శ్రీనాథ్, పాత్రికేయుల గృహనిర్మాణ సహకారం సంఘం అధ్యక్షుడు మునిరాజు, పాత్రికేయుల సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్, మాజీ అధ్యక్షులు గోపినాథ్, రాష్ట్ర సంఘం కార్యదర్శి వాసుదవహొళ్ల పాల్గొన్నారు.


