భక్తిశ్రద్ధలతో ఈద్‌ మిలాద్‌ | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో ఈద్‌ మిలాద్‌

Aug 27 2026 12:30 AM | Updated on Aug 27 2026 12:30 AM

తుమకూరు: రాష్ట్రమంతటా బుధవారం ముస్లింలు హజరత్‌ పైగంబర్‌ జయంతిని పురస్కరించుకుని ఈద్‌ మిలాద్‌ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తుమకూరులో బార్‌లైన్‌ రోడ్డులోని మక్కా మసీదులో విశేష ప్రార్థనలు జరిగాయి. అంతకుముందు జెండాతో భారీ ఊరేగింపు సాగింది. మాజీ ఎమ్మెల్యే రఫీక్‌ అహ్మద్‌, మతపెద్దలు పాల్గొన్నారు. మహమ్మద్‌ ప్రవక్త ఉపదేశించిన ఆశయాల మేరకు జీవనం సాగించాలని పెద్దలు బోధించారు.

చింతామణి: చింతామణి పట్టణంలో ముస్లింలో ఊరేగింపు నిర్వహించి పెద్ద పేట జామియా మసీదులో సామూహిక ప్రార్ధనలు జరిపి ఈద్‌ ముబారక్‌ తెలుపుకొన్నారు.

చిక్కబళ్లాపురం: చిక్కబళ్లాపురం నగరంలో ముస్లింలు బిబి రోడ్డులో గల పెద్ద మసీదుకు చేరుకొని అక్కడి నుంచి జెండాతో ఊరేగింపు చేబట్టారు. ప్రశాంత నగరలోని ఈద్గా మైదానంలో ప్రార్థనలు జరిపి శుభాకాంక్షలు చెప్పుకున్నారు.

తుమకూరులో వేడుకలు

చిక్కబళ్లాపురంలో ఊరేగింపు

చింతామణి పట్టణంలో

అంతటా ముస్లింల ఊరేగింపు వేడుకలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement