ఓనం ఆనందాలకు నాంది | - | Sakshi
Sakshi News home page

ఓనం ఆనందాలకు నాంది

Aug 27 2026 12:30 AM | Updated on Aug 27 2026 12:30 AM

మైసూరు: కేరళీయులు ఎంతో వైభవంగా జరుపుకొనే ఓనం పండుగ సంబరాలు మొదలయ్యాయి. కన్నడనాడులో స్థిరపడిన వేలాదిమంది కేరళీయులు బుధవారం ఇళ్ల ముందు పుష్ప రంగవల్లులు, పాటలు, నృత్యాలతో ఆనందంగా ఆచరించారు. మైసూరు జిల్లాలోని హెచ్‌.డి.కోట తాలూకాలోని పడుకోటెలో 10 రోజుల ఓనం పండుగకు కేరళీయులు నాంది పలికారు. యువతి సజీవ మాట్లాడుతూ మా పండుగలో ముఖ్యంగా పువ్వులతో ముగ్గులు వేయడం ఒక సంప్రదాయం, 25 రకాలకు పైగా శాకాహార వంటకాలతో కూడిన పెద్ద విందును కుటుంబం, బంధువులతో కలిసి ఆరగిస్తాము అని తెలిపారు. అరటి ఆకులపై భోజనం వడ్డించడం తమ సంస్కృతి అన్నారు. స్థానిక కన్నడిగ ప్రజలు కూడా ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తారని అన్నారు. సెయింట్‌పాల్‌ మిషన్‌ హైస్కూల్‌లోనూ ఓనంను నిర్వహించారు.

కేరళీయుల సంబరాలు షురూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement