● తోటలో కొండచిలువ | - | Sakshi
Sakshi News home page

● తోటలో కొండచిలువ

Aug 27 2026 12:30 AM | Updated on Aug 27 2026 12:30 AM

మండ్య: మండ్య జిల్లాలోని గాణలు సమీపంలోని గ్రామంలోని ఒక పొలంలో సుమారు 10 అడుగుల పొడవైన కొండచిలువను పట్టుకున్నారు. తోటలో పనిచేస్తుండగా, చెరువులో నుంచి వచ్చిన కొండచిలువను చూసి భయంతో పారిపోయానని రైతు చెప్పారు. స్నేక్‌ కృష్ణకు సమాచారం ఇవ్వగా ఆయన వచ్చి స్థానికులతో కలిసి దానిని పట్టుకున్నారు. ఆయన మాట్లాడుతూ మిత్రుడు జగదీష్‌ కలిసి హలగూరు ప్రాంతంలో సుమారు 15 కొండచిలువలను పట్టుకుని అడవిలోకి వదిలివేశామన్నారు. ఏ రకమైన పామును చూసినా దానిని కొట్టవద్దని, మాకు తెలియజేస్తే, మేము వచ్చి దానిని రక్షించి అడవిలో వదిలివేస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement