నాలుగో రోజూ రభసే | - | Sakshi
Sakshi News home page

నాలుగో రోజూ రభసే

Aug 21 2026 3:21 AM | Updated on Aug 21 2026 3:21 AM

వంచన కేసును రద్దు చేయలేం

రైల్వేస్టేషన్లలో

నాసిరకం ఆహారం

తనిఖీలలో వెల్లడి

దొడ్డబళ్లాపురం: రైల్వేస్టేషన్లలో, రైళ్లలో విక్రయించే ఆహారం ఎంత నాణ్యత, శుచితో ఉంటుందో చెప్పనవసరం లేదు. దీనిపై వందలాది వీడియోలు కనిపిస్తాయి. ఈ నేపథ్యంలో ఆహార భద్రత, ఔషధ విభాగాల అధికారులు రాష్ట్రంలోని అన్ని రైల్వేస్టేషన్‌లలో తనిఖీలు చేపట్టారు. హోటళ్లు, క్యాంటీన్‌లు, షాపుల్లో ఆహార పదార్థాల నాణ్యత పరిశీలించారు. రాష్ట్రంలో 36 రైల్వేస్టేషన్‌లలో సోదాలు చేయగా, ఎక్కువశాతం హోటళ్లు, షాపుల్లో నాణ్యత లేని, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, అపరిశుభ్రత తదితర లోపాలు కనిపించాయి. సమోసాలు, బజ్జీలు, వడలను న్యూస్‌ పేపర్‌లపై ఉంచి, ప్యాక్‌ చేసి విక్రయిస్తుండడం చూసి మందలించారు.

మిఠాయిల్లో నిషేధిత రంగులు

నిషేధిత ప్లాస్టిక్‌ కవర్‌లు వాడుతున్నట్టు గుర్తించారు. జిలేబి, కోవా లాంటి స్వీట్లలో నిషేధిత రంగులు వాడినట్టు తేలింది. గడువు మీరిన పాలు, పెరుగు తదితరాల శాంపిల్స్‌ను సేకరించారు. మైసూరు రైల్వేస్టేషన్‌లో వివరాలు లేని చపాతి పాకెట్లు, బూజు పట్టిన కూరగాయలు కనిపించాయి. బెంగళూరు కేఆర్‌ పురం రైల్వేస్టేషన్‌లోని క్యాంటీన్లలో ఏమాత్రం పరిశుభ్రత లేదని వెల్లడైంది. దీంతో యజమానులకు నోటీసులు ఇచ్చి మెరుగుపరచాలని ఆదేశించారు.

మంత్రి నాగేంద్ర విచారణకు సీబీఐ లేఖ!

బనశంకరి: మహర్షి వాల్మీకి గిరిజన అభివృద్ధి మండలిలో చోటుచేసుకున్న కోట్లాది రూపాయలు కుంభకోణం కేసులో ప్రణాళిక, గణాంక మంత్రి బీ.నాగేంద్రను విచారించడానికి అనుమతి కోరుతూ గవర్నర్‌ థావర్‌చంద్‌ గెహ్లాట్‌కు సీబీఐ లేఖ రాసినట్లు తెలిసింది. వాల్మీకి అభివృద్ధి మండలిలో సుమారు రూ.89.63 కోట్లు నకిలీ చెక్‌లు, ఆర్‌టీజీఎస్‌ ద్వారా అక్రమంగా వందలాది బినామీ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేసి స్వాహా చేశారని గతంలో మంత్రిగా ఉన్న నాగేంద్ర, ఆయన సన్నిహితులు, మండలి, బ్యాంకు అధికారులపై కేసు దాఖలైంది. సీబీఐ, ఈడీలు ముమ్మరంగా దర్యాప్తు జరిపాయి.

హైవేపై ప్రైవేటు బస్సు పల్టీ

ఇద్దరు మృతి, 20 మందికి గాయాలు

మండ్య: బెంగళూరు–మంగళూరు హైవేలో మండ్య దగ్గర నెల్లిగెరె టోల్‌గేట్‌ వద్ద ప్రైవేటు లగ్జరీ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు క్లీనర్‌, ఓ మహిళ మరణించారు. ఉడుపి జిల్లా బైందూరుకు చెందిన క్లీనర్‌ అశోక్‌ పూజారి (35), బెంగళూరు ఆర్‌ఆర్‌నగర నివాసి ఉదయ్‌ శాన్‌భాగ్‌ భార్య కస్తూరి శాన్‌భాగ్‌ (64) మృతులు. ఉడుపి జిల్లా బైందూరు నుంచి సుగమ ట్రావెల్స్‌ బస్సు బెంగళూరుకు వెళుతుండగా గురువారం తెల్లవారుజామున 5 గంటలప్పుడు డ్రైవర్‌ నిద్రమత్తులో రోడ్డు పక్కన ఉన్న సూచన ఫలకాన్ని ఢీకొన్నాడు. రోడ్డు పక్కకు బోల్తా పడింది. బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఇద్దరు అక్కడే మరణించగా, డ్రైవర్‌ సహా 20 మంది గాయాలయ్యాయి. వీరిలో కొందరికి తీవ్ర గాయాలు తగిలాయి. బెళ్లూరు పోలీసు స్టేషన్‌ ఎస్‌ఐ రవికుమార్‌, పోలీసులు చేరుకుని బాధితులను బీజీ నగర ఆదిచుంచనగిరి ఆస్పత్రిలో చేర్పించారు. కలెక్టర్‌ కుమార్‌, జిల్లా ఎస్పీ డా. శోభారాణి, తహసీల్దార్‌ అశోక్‌ తదితరులు బాధితులను పరామర్శించారు.

శివాజీనగర: రాష్ట్ర ప్రణాళిక, గణాంక శాఖ మంత్రి బి.నాగేంద్ర రాజీనామా చేయాలని కోరుతూ ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్‌ సభ్యులు గురువారం నాలుగో రోజు కూడా అసెంబ్లీలో ఆందోళనను కొనసాగించడంతో సభా కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. వాల్మీకి గిరిజన అభివృద్ధి మండలిలో నిధుల స్కాంలో నిందితుడైన మంత్రి నాగేంద్ర రాజీనామా చేయాలని, లేదా మంత్రివర్గం నుంచి తొలగించాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభ ప్రారంభం కాగానే పట్టుబట్టారు. నాగేంద్రను సాగనంపాలని గట్టిగా నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది. సభను సాగనివ్వాలని విధానసభ స్పీకర్‌ జీ.ఎస్‌.పాటిల్‌ విజ్ఞప్తి చేసినప్పటికీ, పట్టించుకోకుండా ధర్నాకు దిగారు.

24 కేసులు ఉన్నాయి

బీజేపీ పక్ష నేత ఆర్‌.అశోక్‌ మాట్లాడుతూ మంత్రి నాగేంద్ర నిందితుడు కాదని డిప్యూటీ సీఎం పరమేశ్వర్‌ సభకు తప్పుడు సమాచారం ఇచ్చారని అన్నారు. నాగేంద్రపై 24 కేసులు ఉన్నాయని పేర్కొంటూ సీబీఐ ఇచ్చిన చార్జిషీట్‌ను ప్రదర్శించారు. అటువంటి అవినీతి ఆరోపణలున్న ఎమ్మెల్యేలను మంత్రివర్గంలో ఉంచడం సరికాదని అన్నారు. గతంలో సీఎం సిద్దరామయ్య నాగేంద్రను మంత్రి పదవినుంచి తొలగించారు, డీకే శివకుమార్‌ తిరిగి కేబినెట్‌లోకి తీసుకున్నారని విమర్శించారు. అవినీతి ఆరోపణలున్న నాగేంద్రను తప్పించాల్సిందే అన్నారు. ఒక్క నాగేంద్ర 224 మంది ఎమ్మెల్యేల హక్కులను లాక్కోవడం సరికాదు, కోట్లాది దళితులకు చెందాల్సిన డబ్బును ఆయన దోచుకున్నారు. ఇలాంటి వారు కేబినెట్‌లో ఉండకూడదని అశోక్‌ ధ్వజమెత్తారు. అన్ని విషయాలను చర్చిద్దామని స్పీకర్‌ సూచించినా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు తగ్గకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం మొదలుపెట్టారు. వాల్మీకి డబ్బు ఎక్కడికి వెళ్లింది, రాహుల్‌గాంధీ ఇంటికి వెళ్లింది.. అని హేళనగా నినదించారు. స్పీకర్‌ జీరో అవర్‌ను నిర్వహించి, అర్ధగం పాటు వాయిదా వేశారు. బీజేపీ సభ్యులు నల్ల రిబ్బన్‌, కంకణాలు ధరించారు. ఈ రభస మధ్యనే పలువురు మంత్రులు ప్రసంగించారు, కొన్ని బిల్లులను ఆమోదించారు.

ఎమ్మెల్యే ప్రదీప్‌ హల్‌చల్‌

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ప్రదీప్‌ ఈశ్వర్‌, బీజేపీ సభ్యులకు పోటీగా బీజేపీ చోర్‌ హై అని నినాదాలు చేశారు. ఈ సమయంలో మంత్రి రామలింగారెడ్డి ప్రదీప్‌ వద్దకు వెళ్లి సీట్లోకి వెళ్లమని కోరారు. కానీ ప్రదీప్‌ వినకుండా ముందు వరుసలోనే నిలబడి నినాదాలు చేయసాగారు. కాంగ్రెస్‌ సభ్యుడు రవి గానిగ వచ్చి ప్రదీప్‌ను సీటు వద్దకు తీసుకు వెళ్లేందుకు యత్నించగా, పట్టించుకోలేదు. చివరకు మంత్రి భైరతి సురేష్‌ ప్రదీప్‌ను సీటు వద్దకు తీసుకువెళ్లారు. బీజేపీ సభ్యులు ప్రదీప్‌ను ఎగతాళి చేస్తూ నినాదాలు చేశారు.

అసెంబ్లీ కార్యక్రమాలను శ్రద్ధగా వీక్షిస్తున్న విద్యార్థులు

విధానసభ సమావేశం

ఆగని ఈడీ సోదాలు

శివాజీనగర: కేపీఎస్‌సీ పశు వైద్యాధికారుల ఉద్యోగాల స్కాంలో ఈడీ సోదాలు కొనసాగిస్తోంది. అయితే కేపీఎస్‌సీ సభ్యురాలు శాంతా హొసమణి పరారయ్యారు. గోవా లేదా మైసూరుకు వెళ్లినట్లు ఈడీకి సమాచారం అందింది. మాజీ చైర్మెన్‌ శివశంకరప్ప సాహుకార్‌ ఇంటిలో తనిఖీలు కొనసాగాయి. దీంతో పాటు కొందరు అభ్యర్థుల ఇళ్లలోనూ సోదాలు చేయడంతో కుటుంబసభ్యులు భయాందోళనలకు గురయ్యారు. మహిళలు విలపిస్తూ తమవారు తప్పచేయలేదని, కష్టపడి పరీక్ష పాసయ్యారని చెప్పారు.

మంత్రి నాగేంద్ర రాజీనామాకు

బీజేపీ తీవ్ర పట్టు

గందరగోళంతో చర్చలకు ఆటంకం

25,921 పాలిటెక్నిక్‌ సీట్లు ఖాళీ

శివాజీనగర: రాష్ట్రంలో 117 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలు పనిచేస్తున్నాయి. వాటిలో 72,057 సీట్లు అందుబాటులో ఉన్నాయని, అయితే విద్యార్థులకు పూర్తిస్థాయిలో ప్రవేశాలు లభించడం లేదని ఉన్నత విద్యాశాఖ మంత్రి బసవరాజ రాయరెడ్డి తెలిపారు. 25,921 పాలిటెక్నిక్‌ సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. ఓ ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు బదులిస్తూ 46,136 మంది విద్యార్థులు చేరారన్నారు. 135 ప్రైవేటు పాలిటెక్నిక్‌లు ఉన్నాయన్నారు.

2వ ఎయిర్‌పోర్టుకు 3 స్థలాల ఎంపిక

బనశంకరి: బెంగళూరు వద్ద రెండో విమానాశ్రయం కోసం మూడు ప్రదేశాలను ఎంపిక చేశామని గురువారం విధానసభలో తుమకూరు ఎమ్మెల్యే జ్యోతిగణేశ్‌ అడిగిన ప్రశ్నకు మంత్రి ఎంబీ.పాటిల్‌ సమాధానమిచ్చారు. రామనగర పరిధిలో సోమనహళ్లి–కనకపుర రోడ్డు, చూడహళ్లి–కనకపుర రోడ్డు వద్ద స్థలాలు, నెలమంగళ వద్ద గూడెమారనహళ్లిని ఎంపిక చేసినట్లు, ఇందులో తుమకూరు లేదని చెప్పారు. హరోహళ్లి పరిశీలనలో ఉందన్నారు.

3 బిల్లులకు ఆమోదం

బనశంకరి: విధానసభలో ప్రతిపక్షాల ధర్నా మధ్య బెంగళూరు అభివృద్ధి ప్రాధికార (బీడీఏ) సవరణ బిల్లుతో పాటు 3 బిల్లులను సభ ఆమోదించింది. కర్ణాటక పట్టణ, గ్రామాంతర పథకం బిల్లు, నాడప్రభు కెంపేగౌడ చారిత్రక స్థలాల అభివృద్ధి ప్రాదికార బిల్లుల సవరణలను ఆమోదించారు. బీడీఏ భూస్వాధీనం చేసుకున్న భూమిలో అనేక లేఔట్లు ఏర్పాటు కాగా, నివాసితులకు శాశ్వత రికార్డులు అందించడానికి సవరణ అవసరమని మంత్రి కృష్ణబైరేగౌడ తెలిపారు. 1,11,560 అనధికార ఇళ్లు ఇలా నిర్మించారన్నారు.

యశవంతపుర: ప్రేమ పేరుతో నాటకం అడి, యువతి పెళ్లికి నిరంతరం అడ్డుపడి ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తిపై నమోదైన కేసు రద్దు చేయటానికి సాధ్యం కాదని హైకోర్టు అభిప్రాయపడింది. నిందితుడు పూర్తిగా విచారణను ఎదుర్కొని అరోపణల నుంచి విముక్తి కావాలని సూచించింది. తనపై దాఖలైన కేసును రద్దు చేయాలని జె.నవీన్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.నాగప్రసన్న విచారణ చేపట్టి పై మేరకు ఆదేశాలు జారీ చేశారు. వివరాలు... నవీన్‌ అనే యువకుడు ఓ యువతి వెంటపడేవాడు. తనను ప్రేమించాలని ఒత్తిడి చేశాడు. పెళ్లి చేసుకుంటానని నాటకం ఆడాడు. లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నవీన్‌ వంచన వెలుగు చూడటంతో అతన్ని దూరం పెట్టింది. అనంతరం ఆ యువతికి పెద్దలు పెళ్లి సంబంధాలు చూస్తుండగా నవీన్‌ ఆ యువతికి చెందిన ప్రైవేట్‌ ఫొటోలను సేకరించి పెళ్లి సంబంధం తప్పిపోయేలా చేశాడు. దీంతో బాధితురాలు 2025 జూలై 5న నిద్రమాత్రలను మింగింది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అదేనెల 29న మృతి చెందింది. ఈకేసుకు సంబంధించి నవీన్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసును కొట్టివేయాలని నిందితుడు కోర్టును ఆశ్రయించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement