పొలాలకు పొదుపుగా కావేరి నీరు | - | Sakshi
Sakshi News home page

పొలాలకు పొదుపుగా కావేరి నీరు

Aug 21 2026 3:21 AM | Updated on Aug 21 2026 3:21 AM

శివాజీనగర: అనావృష్టి, కావేరి ప్రాజెక్టుల్లో ఉన్న నీటి నిల్వ దృష్ట్యా రైతులకు తక్కువ ప్రమాణంలో నీటిని వదలాలని కావేరీ నీటిపారుదల సలహా కమిటీ సమావేశంలో నిర్ణయించారు. జలవనరుల మంత్రి ఎన్‌.చెలువరాయస్వామి, అధికారులతో వికాససౌధలో సమావేశం జరిపారు. వర్షాలు లేక జలాఽశయాల్లో నీటి లభ్యత ఆశించిన స్థాయిలో లేదని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పెద్దమొత్తంలో నీటిని విడుదల చేస్తే రాబోయే రోజుల్లో తాగునీటికి కొరత వస్తుందని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడాలని నిర్ణయించామన్నారు. ఈ సీజన్‌లో వరి, చెరకు వంటి అధిక నీటి వినియోగం గల పంటలకు బదులుగా, మెట్ట పంటలకు రైతులు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కావేరీ బేసిన్‌లోని సరస్సులు, జలాశయాలను నింపి భూగర్భ జల మట్టాన్ని పెంచాలని నిర్ణయించారు. ప్రతి నీటి ప్రతి చుక్కను బాధ్యతతో వాడుకోవాలి. రైతుల పొలాలతో పాటు తాగునీరు, ఇతర అవసరాలకు నీటి లభ్యతను నిర్ణయిస్తామని తెలిపారు. మంత్రులు యతీంద్ర, నరేంద్రస్వామి, మండ్య, మైసూరు ఎమ్మెల్యేలు, కలెక్టర్లు పాల్గొన్నారు.

మెట్ట పంటలే వేయాలి

నీటిపారుదల భేటీలో మంత్రి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement