అదరాలకు విషతుల్యం! | - | Sakshi
Sakshi News home page

అదరాలకు విషతుల్యం!

Aug 17 2026 1:53 AM | Updated on Aug 17 2026 1:53 AM

సాక్షి బెంగళూరు: లిప్‌స్టిక్‌లు అన్నీ నాణ్యమైనవి, నిరపాయకరమైనవి కాదు, ఇందులో కల్తీవి కూడా ఉంటాయి. అవి అదర అందాలను, ఆరోగ్యాన్ని పాడు చేసే ప్రమాదముంది... అని ఆహార భద్రతా శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కర్ణాటక ఆహార భద్రతా విభాగం పరిశీలనలో కొన్ని లిప్‌స్టిక్‌లు ప్రమాదకరమైనవని గుర్తించారు. బెంగళూరు సిటీలో విక్రయిస్తున్న పలు బ్రాండెడ్‌ లిప్‌స్టిక్‌ ఉత్పత్తులతో పాటు రోడ్ల పక్కన చవగ్గా దొరికే లిప్‌స్టిక్‌ శాంపుల్స్‌ను సేకరించి ల్యాబ్‌ పరీక్షలకు పంపించారు. 23 శాంపుల్స్‌లో ప్రమాదకర రసాయనాలు బయటపడినట్లు రాష్ట్ర ఆహార భద్రతా విభాగం కమిషనర్‌ శ్రీనివాస్‌ తెలిపారు.

క్యాన్సర్‌ కారకాలు

కొన్ని శాంపుల్స్‌లో కార్సినోజెనిక్‌ (క్యాన్సర్‌ కారకాలు), విషపూరిత లోహాలు కూడా ఉన్నట్లు తేలింది. వాటిని వాడడం వల్ల అందం ఇనుమడించడం మాటేమో కానీ ఆరోగ్యం దెబ్బతింటుందని అధికారులు హెచ్చరించారు. ఏళ్ల తరబడి వాడితే క్యాన్సర్‌కు దారి తీస్తాయని తెలిపారు. పరీక్షల పూర్తి నివేదిక అందిన తర్వాత తగు చర్యలు తీసుకుంటామన్నారు.

నకిలీ ఉత్పత్తులే అధికం

ఫిర్యాదులు రావడంతో నకిలీ కాస్మొటిక్స్‌పై దృష్టి పెట్టారు. బెంగళూరులోని మార్కెట్లలో ప్రముఖ అంతర్జాతీయ, దేశీ బ్రాండ్ల లిప్‌స్టిక్‌, పౌడర్లు, ఫేషియల్‌ క్రీములు, స్కిన్‌ సీరమ్‌లు తదితర సౌందర్య లేపనాలను పరిశీలించారు. ఇందులో విక్రయిస్తున్న వాటిలో చాలా వరకు నకిలీవిగా గుర్తించడం విశేషం. బ్రాండెడ్‌ పేరుతో అమ్ముతున్నారు. అనేక కాస్మొటిక్స్‌ శాంపుల్స్‌ను ల్యాబ్‌లకు పంపించారు. ‘నాణ్యత పాటించే కంపెనీల లిప్‌స్టిక్‌లు కొనుగోలు చేయాలి. చవకబారు ఉత్పత్తులను ఉపయోగించరాదని’ శ్రీనివాస్‌ సూచించారు.

బెంగళూరులో కల్తీ, హానికారక

పెదవి పూతలు

ఆహార భద్రతా శాఖ తనిఖీలలో వెల్లడి

మార్కెట్లలో నకిలీ కాస్మొటిక్స్‌ హవా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement