● హడావుడిగా పూర్తి
మైసూరు: అటవీ శాఖ సిబ్బంది కాల్పుల్లో చనిపోయిన ఆంథోనీ, పీటర్, కుమార్‌ల మృతదేహాలు మైసూరులోని కే.ఆర్. ఆసుపత్రి మార్చురీలో ఉంచారు. ఇద్దరి శవాలకు పోస్ట్‌మార్టం చేయడానికి కుటుంబాలు అంగీకరించాయి. పీటర్ సోదరి, నర్సు అయిన మార్గరెట్ మాట్లాడుతూ పోలీసులు, జిల్లా యంత్రాంగం అమాయకులను చంపి పోస్ట్‌మార్టం పూర్తి చేశారని ఆరోపించారు. చాలాసేపు పోస్ట్‌మార్టం వద్దని వారు అడ్డుకున్నారు. అటవీ శాఖ ఉన్నతాధికారులు వచ్చి తగిన నష్టపరిహారం ప్రకటించే వరకు అంగీకరించబోమని పట్టుబట్టారు. ఆంధోనీ, కుమార్ మృతదేహాలను పోస్ట్‌మార్టంకు పంపుతుండగా బంధువులు పోలీసులతో గొడవకు దిగి అడ్డుగా కూర్చున్నారు. ఉద్రిక్తత పెరగడంతో, మృతదేహాలను తిరిగి మార్చురీకి పంపించారు.
పంచనామా పేరుతో...
మృతుల కుటుంబసభ్యుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకున్న పోలీసులు, ఇది పంచనామా ప్రక్రియ అని చెప్పి పోస్టుమార్టం పత్రాలపై వారి నుంచి సంతకాలు తీసుకున్నారు. తరువాత హడావుడిగా పోస్ట్‌మార్టం పూర్తి చేశారని ఆరోపణలు ఉన్నాయి. పోస్ట్‌మార్టం చేయడానికి మేము అనుమతి ఇవ్వలేదని మార్గరెట్ చెప్పారు. నిబంధనలను పట్టించుకోలేదని వాపోయారు.


