స్వాతంత్య్ర సమరం.. బళ్లారికి స్థానం | - | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్ర సమరం.. బళ్లారికి స్థానం

Aug 14 2026 7:56 AM | Updated on Aug 14 2026 7:56 AM

టర్కీ రాజవంశీకుల సమాధులు

టర్కీ సైనికుల శ్మశానవాటికలో స్మారక స్థూపం

టర్కీ సైనికుల శ్మశానవాటిక ప్రవేశద్వారం

బళ్లారి రూరల్‌: స్వాతంత్య్ర సమరంలో దేశానికి బానిసత్వం నుంచి విముక్తికి సర్వం ధారబోసిన మహనీయులు కొందరు. భరతమాత బానిస సంకెళ్లను తెంచడానికి ప్రాణాలను సైతం తృణపాయంగా భావించిన వారు మరికొందరు. ఆ పుణ్య పురుషుల పాద ధూళితో చరిత్ర పుటల్లో బళ్లారి స్థానం పొందింది.

అల్లీపుర జైలుకు ఘన చరిత్ర

స్వాతంత్య్ర పోరాటానికి మునుపే 1887లో నగరంలోని అల్లీపురలో 16 భవనాలతో కూడిన జైలును నిర్మించారు. దీని పక్కనే కంటోన్మెంట్‌లో బ్రిటిష్‌ సైనికుల స్థావరాలు ఉండేవి. 1913 నుంచి 1918 వరకు జరిగిన మొదటి ప్రపంచ యుధ్ధంలో బ్రిటిష్‌ సైన్యం చేతిలో బందీలైన 2 వేల మంది టర్కీ దేశ సైనికుల్లో వెయ్యి మందిని సింగపూర్‌లోని నాసిక్‌ వద్దగల దేవలాలి జైలుకు తరలించగా, వెయ్యి మందిని 1918లో భారత్‌కు తరలించారు. అల్లీపుర జైలు కేర్‌టేకర్‌గా వ్యవహరించిన హాజీ పి.సాహిక్‌ అడమ్‌ పొందుపరిచిన వివరాల ప్రకారం కౌల్‌బజార్‌లో బందీలు పని చేయకుండా ప్రార్ధన చేస్తున్నారనే కోపంతో కాల్పులంటే వ్యామోహం కలిగిన ఓ బ్రిటిష్‌ అధికారి ఒక్కసారిగా 100 మందిని కాల్చివేశాడు. దీంతో ఈ ప్రాంతాన్ని నేటికీ ఖూనిఠాణాగా పిలుస్తున్నారు. కానీ రికార్డుల ప్రకారం 1934లో ప్లేగు వ్యాధి సోకి టర్కీ సైనికులు మరణించారని ఉంది.

విమానాశ్రయం వద్ద టర్కీ సైనికుల స్మారకాలు

మరణించిన టర్కీ సైనికుల మృతదేహాలను ఇప్పటి బళ్లారి విమానాశ్రయం వద్దగల శాంతినగర్‌లో పూడ్చారు. ఇక్కడ టర్కీ ప్రభుత్వం సమాధులను నిర్మించింది. ఇక్కడ ఆ దేశ పతాకాన్ని కూడా ఆవిష్కరించింది. ప్రస్తుతం ఇది టర్కీ మార్చురీగా సందర్శకులను అలరిస్తోంది. ప్రతి ఏడాది టర్కీవాసులు ఈ ప్రాంతానికి వచ్చి నివాళులు అర్పిస్తుంటారు. అల్లీపుర జైల్లో స్వాతంత్య్ర పోరాట యోధులను నిర్బంధించారు. శాంతినగర్‌లో టర్కీ సైనికులను పూడ్చిన ప్రదేశం ఆక్రమణకు గురైంది. దేశం కోసం పోరాడిన వీరుల సమాధులపై నడవటం మంచిది కాదు. ఈ ప్రాంతాన్ని కూడా అప్పగించాలని టర్కీకి చెందిన ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు గతంలో ఢిల్లీ నుంచి కరోనల్‌ కరీం బళ్లారి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో పోరాడిన వావిలాల గోపాలకృష్ణ, నాడు స్వాతంత్య్ర సమరయోధులు అల్లీపుర జైల్లో గడిపారు. ఇప్పటికీ విమ్స్‌లో స్వాతంత్య్ర సమర యోధులు గడిపిన గుర్తులు ఉన్నాయి.

జైలులో నాడు బందీలను ఉంచిన బ్యారక్‌లు

అల్లీపురలోని నాటి పురాతన జైలు భవనం

నాటి అల్లీపుర జైల్లో

టర్కీ దేశ సైనికులు బందీ

విమానాశ్రయం వద్ద టర్కీ పార్కులో యువరాజు సమాధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement