మంత్రి పదవి నుంచి తొలగించాలి | - | Sakshi
Sakshi News home page

మంత్రి పదవి నుంచి తొలగించాలి

Aug 14 2026 7:56 AM | Updated on Aug 14 2026 7:56 AM

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలోని కాంగ్రెస్‌ సర్కార్‌లో ముఖ్యమంత్రి డీ.కే.శివ కుమార్‌ కేబినెట్‌లో పదవి పొందిన మంత్రి నాగేంద్రను తొలగించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరనగౌడ డిమాండ్‌ చేశారు. గురువారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సిద్దరామయ్య ముఖ్యమంత్రిగా కొనసాగిన సమయంలో మహర్షి వాల్మీకి అభివృద్ధి మండలిలో రూ.కోట్లలో జరిగిన అవినీతి కుంభకోణంలో చిక్కుకుని పదవికి రాజీనామా చేశారని, ఈ కేసు కోర్టులో నడుస్తుండగానే మంత్రివర్గంలో చేర్చుకోవడం తగదన్నారు. కేసు విచారణ జరుగుతుండగా ముఖ్యమంత్రి డీ.కే.శివ కుమార్‌ నాగేంద్ర ఒత్తిడికి తలొగ్గి పదవిని కేటాయించారన్నారు. నాగేంద్రను మంత్రి పదవి నుంచి తొలగించాలని ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement