కావేరి నీరు జన్మహక్కు | - | Sakshi
Sakshi News home page

కావేరి నీరు జన్మహక్కు

Aug 2 2026 1:46 AM | Updated on Aug 2 2026 1:46 AM

మండ్య: తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని కావేరీ జల నియంత్రణ సంస్థలు ఇచ్చిన ఉత్తర్వును ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయరాదని మండ్య నగరంలో నాలుగో రోజూ నిరసనలు కొనసాగాయి. రక్షణ వేదిక, ముస్లిం యువత సహా పలు సంస్థల కార్యకర్తలు నగరంలోని జే.సి. సర్కిల్‌లో కావేరి కమిటీలకు, తమిళనాడు సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

గో బ్యాక్‌ విజయ్‌

మండ్య రక్షణ వేదిక కార్యకర్తలు గో బ్యాక్‌ విజయ్‌ అని రాసి ఉన్న ప్లకార్డులను ప్రదర్శించారు. సముద్రంలోకి కలిసే కావేరి నీటిని అడ్డుకోవడానికి ప్రభుత్వం తక్షణమే అదనపు ఆనకట్టలను నిర్మించాలని కోరారు. తమిళనాడు నిరంతరం కర్ణాటకపై ఒత్తిడి తెస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో చర్చలు జరపడం వల్ల ప్రయోజనం ఉండదని అన్నారు. కావేరి కర్ణాటక జీవనాడి, కర్ణాటక హక్కులను కాపాడండి అని నినాదాలు చేశారు.

మండ్యలో కన్నడ, రైతు సంఘాల ఆందోళనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement