రూ.82 కోట్ల విలువైన డ్రగ్స్‌ ధ్వంసం | - | Sakshi
Sakshi News home page

రూ.82 కోట్ల విలువైన డ్రగ్స్‌ ధ్వంసం

Jul 31 2026 2:09 AM | Updated on Jul 31 2026 2:09 AM

బనశంకరి: మంగళూరు పరిసరాల్లో నిర్వహించిన దాడుల్లో పట్టుబడిన రూ.82 కోట్ల విలువచేసే మాదకద్రవ్యాలను మంగళూరు పోలీసులు ధ్వంసం చేశారు. మంగళూరు నగర పోలీస్‌కమిషనర్‌ సుధీర్‌కుమార్‌రెడ్డి బుధవారం వివరాలు వెల్లడించారు. 16 పోలీస్‌స్టేషన్లలో నమోదైన 59 ఎన్‌డీఎస్‌ కేసులకు సంబంధించి స్వాధీనం చేసుకున్న 450 కిలో గంజాయి, 43కిలోల ఎండీఎంఏ, 880 గ్రాముల హైడ్రోవిడ్‌గాంజా, కిలో 200 గ్రాముల బాంగ్‌, 80 గ్రాముల చరస్‌ను కోర్టు అనుమతితో కోళ్నాడు ఇండస్ట్రీయల్‌ ప్రాంతంలో డ్రగ్స్‌ డిస్పోజల్‌కమిటీ సమక్షంలో ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు. 2026లో ఇప్పటివరకు మంగళూరు నగర పోలీసులు 87 ఎన్‌డీపీఎస్‌ కేసులు నమోదుచేసి 157 మంది డ్రగ్ప్‌పెడ్లర్లను అరెస్ట్‌చేశారన్నారు. వీరి వద్ద నుంచి రూ.8,18,30,130 విలువచేసే 148 కిలోల 615 గ్రాములు గాంజా, 7 కిలోల 165 గ్రాముల ఎండీఎంఏ, కిలో 705 గ్రాములు హైడ్రోవిడ్‌గాంజా స్వాధీనం చేసుకున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement