మండ్యలో నిరసనల హోరు | - | Sakshi
Sakshi News home page

మండ్యలో నిరసనల హోరు

Jul 31 2026 2:09 AM | Updated on Jul 31 2026 2:09 AM

జననాయగన్‌పై ఆగ్రహ జ్వాల

మండ్య: మండ్యలో ఊపందుకున్న కావేరి జలాల చిచ్చు తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ నటించిన జననాయగన్‌ చిత్రం వైపు మళ్లింది. నగరంలోని గురుశ్రీ థియేటర్‌ ముందున్న పోస్టర్‌ను చించి వేసి చిత్రాన్ని ప్రదర్శించవద్దంటూ ఆందోళనకారులు హెచ్చరించారు. దీపక్‌ నేతృత్వంలో థియేటర్‌ను ముట్టడించారు. తరువాత జిల్లాధికారి కార్యాలయం వద్ద బైఠాయించారు. కావేరి ఆయకట్టు రైతుల ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం కాపాడాలన్నారు. పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. తమిళనాడుకు నీరు వదలరాదని కరవే (ప్రవీణ్‌శెట్టి వర్గం) కార్యకర్తలు నగరంలోని కావేరి మండలి కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. తమిళనాడు ప్రభుత్వం, కావేరి నీటి నిర్వహణ సమితికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కర్ణాటకకు మంచినీటికి, రైతులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement