గజాననా.. కరుణించు | - | Sakshi
Sakshi News home page

గజాననా.. కరుణించు

Jul 20 2026 12:56 AM | Updated on Jul 20 2026 12:56 AM

కురుడుమలైలో మాజీ సీఎం యడ్డి పూజలు

కోలారు: ముళబాగిలు తాలూకా కురుడుమలై గ్రామంలో వెలసిన పురాణ ప్రసిద్ధ వినాయక దేవాలయంలో ఆదివారం బీజేపీ మాజీ సీఎం యడియూరప్ప కుటుంబ సమేతంగా విశేష పూజలను నిర్వహించారు. బెంగుళూరు నుంచి ఉదయం 10 గంటలకు ఆలయానికి చేరుకుని పూజల్లో పాల్గొన్నారు. తరువాత విలేకరులతో మాట్లాడిన యడియూరప్ప రాష్ట్రంలో కరువు రోజురోజుకు అధికవుతోందని, ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉందని ఆరోపించారు. వానలు లేక రైతుల పంటలు ఎండుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. జలాశయాలలో నీటిమట్టం పడిపోయిందని, తాగునీటికి కూడా ఇబ్బంది నెలకొందన్నారు. సమావేశాలు నిర్వహిస్తే ప్రయోజనం లేదు, క్షేత్రస్థాయిలో పర్యటించి కరువు నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. బిడది టౌన్‌షిప్‌కు వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బి వై విజయేంద్ర పాదయాత్ర చేస్తారని తెలిపారు.

నాపై కుట్ర జరుగుతోంది: బీకే

దొడ్డబళ్లాపురం: తనపై రాజకీయ కుట్ర జరుగుతోందని, అణగదొక్కాలని కొందరు ప్రయత్నిస్తున్నారని కేపీసీసీ అధ్యక్షుడు బీకే హరిప్రసాద్‌ అన్నారు. ఆదివారంనాడు కేపీసీసీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన రాహుల్‌గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా తామంతా పని చేస్తున్నామన్నారు. ఇందుకోసం రాష్ట్రంలో జాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఈ అభియాన్‌లో పాల్గొనాలని రాహుల్‌ గాంధీని కోరామన్నారు. మంత్రి పదవిని ఆశిస్తున్నారా అన్న ప్రశ్నకు బీకే సమాధానమిస్తూ ఈ ప్రశ్నకు సీఎం సమాధానం ఇవ్వాలన్నారు. 140 మంది ఎమ్మెల్యేలలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలనేది హైకమాండ్‌ నిర్ణయమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement