జై గణేశా
బెంగళూరులో ఫుట్‌పాత్‌ల కబ్జాల తొలగింపు పేరుతో పేదల పొట్టకొట్ట రాదంటూ స్వతంత్ర పార్కులో కమ్యూనిస్టు పార్టీల నిరసన
సకాలంలో జీతాలు ఇవ్వాలి, పెండింగ్ డిమాండ్లను తీర్చాలంటూ బెంగళూరు స్వతంత్ర పార్కులో ఆశా కార్యకర్తల ధర్నా
సెప్టెంబరు మధ్యలో వినాయక చవితి కాగా, గణపతులు అప్పుడే విచ్చేశారు. బెంగళూరు మత్తికెరెలో విక్రయాలకు విఘ్ననాథులు
డివైడర్‌కు ప్రైవేటు బస్సు ఢీ, ముగ్గురు మృతి
సాక్షి, బళ్లారి: బెంగళూరు నుంచి బళ్లారికి వస్తున్న ఓ ప్రైవేట్ బస్సు డివైడర్ పైకి దూసుకెళ్లింది. సోమవారం చిత్రదుర్గం జిల్లా మొళకాల్మూర్ తాలూకా రాంపురం సమీపంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. బెంగళూరు నుంచి బళ్లారి వైపుకు వస్తున్న సోమేశ్వర ట్రావెల్ బస్సు రాంపుర సమీపంలోని సోనాపురం క్రాస్ వద్ద డ్రైవర్ అతి వేగంగా నడపడంతో ఎత్తైన డివైడర్‌ను ఢీకొని ముందుభాగం ధ్వంసమైంది. డ్రైవర్ మహమ్మద్, ప్రయాణికులు అజయ్, నరసింహులు చనిపోగా, 20 మందికి పైగా ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని రాంపురం, బళ్లారి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
త్వరలోనే విస్తరణ: ఖర్గే
బనశంకరి: సాధ్యమైనంత త్వరగా మంత్రివర్గ విస్తరణను చేపడతామని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. సోమవారం బెంగళూరులో నివాసంలో మాట్లాడుతూ వీలైనంత త్వరగా పూర్తవుతుంది, రాహుల్‌గాంధీ ఢిల్లీకి వచ్చారని, చర్చించి ఖరారు చేస్తామన్నారు. పలువురు ఆశావహ ఎమ్మెల్యేలు ఖర్గేను కలిశారు. మరోవైపు సీఎం డీకే శివకుమార్ మాట్లాడుతూ త్వరలో సీఎల్పీ భేటీ నిర్వహిస్తామన్నారు. విస్తరణపై చర్చకు మూడు నాలుగు రోజుల్లో ఢిల్లీకి వెళ్లే అవకాశముందని తెలిపారు.
సదుపాయాలతో విద్యా వికాసం
తుమకూరు: విశ్వవిద్యాలయాలలో నాణ్యమైన విద్యా మౌలిక సదుపాయాల నిర్మాణం జ్ఞానం, పరిశోధన, ఆవిష్కరణ దేశ నిర్మాణానికి పటిష్టమైన పునాది. గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ అన్నారు. సోమవారం తుమకూరు విశ్వవిద్యాలయం, జ్ఞానసిరి క్యాంపస్‌లోని బిదరకట్టేలో కొత్తగా లైబ్రరీ, ఇండోర్ స్టేడియం, వంట భవన నిర్మాణాలను ప్రారంభించారు. వర్సిటీకి ప్రభుత్వం, వివిధ దాతృత్వ సంస్థలు, కార్పొరేట్ సంస్థల సహాయం ఈ అభివృద్ధికి ఎంతగానో దోహదపడిందని గవర్నర్ అన్నారు. నూతన ఇంక్యుబేషన్ సెంటర్, విద్యార్థులలో ఆవిష్కరణ, పరిశోధనలను ప్రోత్సహిస్తుందని ఆయన తెలిపారు. విదార్థులకు పుస్తకాలతో పాటు పోషకాహారం ముఖ్యమన్నారు. డిప్యూటీ సీఎం పరమేశ్వర్ పాల్గొన్నారు.
మల్నాడులో తగ్గిన వానలు
శివమొగ్గ: వారం క్రితం భారీ వర్షాలు కురిసిన మల్నాడు ప్రాంతంలో ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయాయి. దీనివల్ల ప్రధాన జలాశయాల్లోకి నీటి ప్రవాహం గణనీయంగా తగ్గింది.
సోమవారం ఉదయానికి గత 24 గంటల్లో జిల్లాలో మాణి లో 7 మిల్లీమీటర్లు (మి.మీ.), యడూరులో 10 మి.మీ., హులికల్‌లో 5 మి.మీ., మాస్తికట్టేలో 8 మి.మీ., చక్రలో 10 మి.మీ., సేవెహుక్లులో 6 మి.మీ. వర్షపాతం నమోదైంది. లింగనమక్కి డ్యాంలోకి 4,999 క్యూసెక్కుల నీరు చేరుతోంది, ఇన్‌ఫ్లోని బంద్ చేశారు. డ్యాం నీటిమట్టం 1763 అడుగులకు చేరింది, గరిష్ట సామర్థ్యం 1,819 అడుగులు.
భద్రా జలాశయంలోకి 1713 క్యూసెక్కుల నీరు చేరుతుండగా, 220 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. గరిష్ట మట్టానికి 40 అడుగులు లోటుగానే ఉంది. తుంగా జలాశయం నిండిపోగా, 5,182 క్యూసెక్కులు వస్తుంటే, 5,506 క్యూసెక్కులను వదులుతున్నారు. జిల్లాలో ఆకస్మాత్తుగా వానలు తగ్గడంతో రైతుల్లో కలవరం నెలకొంది. తుంగభద్ర నదికి వచ్చే వరద క్షీణించింది.
సాక్షి, బెంగళూరు: చదువుకోవడానికి ఎంతోమంది భారతీయులు విదేశాలకు వెళ్తుంటారు. కానీ భారతదేశానికి వచ్చే విదేశీ విద్యార్థులు కూడా ఉన్నారు. వీరు ఏటేటా పెరుగుతున్నట్లు అఖిల భారత ఉన్నత విద్యా సంస్థ వెల్లడించింది. ఇటీవల ఉన్నత విద్యపై అఖిల భారత సర్వే సంస్థ (ఏఐఎస్‌హెచ్‌ఈ) నిర్వహించిన సమీక్షలో ఉన్నత విద్య కోసం పెద్దసంఖ్యలో విదేశీ విద్యార్థులు భారత్‌కు వస్తుంటే, అందులోనూ కర్ణాటకకు అధికంగా వస్తున్నట్లు తెలిపింది. గత వారం ఈ సర్వే విడుదలైంది. సర్వే ప్రకారం గత ఐదేళ్లలో భారతదేశానికి విదేశీ విద్యార్థుల సంఖ్య 19 శాతం పెరిగింది. మొత్తం 173 దేశాల నుంచి వచ్చారు. వారి తొలి ఎంపిక కర్ణాటక లోని విద్యా సంస్థలే. ఇతర రాష్ట్రాలన్నింటి కంటే కర్ణాటకలోనే ఎక్కువగా విదేశీ విద్యార్థులు చదువుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో మొత్తం 7,914 మంది విదేశీ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ఇది దేశంలోనే అత్యధికం. బెంగళూరులోని ఐఐఎస్సీ, ఐఐఐటీ, ఐఐఎం వంటి విద్యా సంస్థలతో పాటు ప్రైవేటు వర్సిటీలు, సూరత్కల్‌లోని ఎన్‌ఐటీకే, ఐఐటీ ధార్వాడ, బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ వంటి విద్యా సంస్థల్లో విదేశీ విద్యార్థులు ఎక్కువగా చేరుతున్నారు.
కర్ణాటక తర్వాత స్థానాల్లో 7,902 మంది విద్యార్థులతో పంజాబ్ రెండో స్థానం, 6,190 మంది విదేశీయులతో మహారాష్ట్ర మూడో స్థానం, 5,953 మందితో ఉత్తరప్రదేశ్ నాలుగో స్థానం, 5,694 మందితో తమిళనాడు ఐదో స్థానంలో నిలిచాయని సర్వేలో తెలిపారు.
యూజీ కోర్సుల్లో అధికం
విదేశీ విద్యార్థులు ఎక్కువగా అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) కోర్సుల్లో చేరుతున్నారు. మొత్తం విద్యార్థుల్లో 73.6 శాతం మంది వీరే. దేశంలో 42,779 మంది విదేశీయులు యూజీ కోర్సుల్లో అభ్యసిస్తున్నారు. వీరిలో 27,849 మంది పురుషులు, 14,930 మంది యువతులు ఉన్నారు. 16.8 శాతం (9,845) మంది పీజీ కోర్సులు అభ్యసిస్తున్నారు.
కర్ణాటక విద్యాలయాల్లో ఆధునిక బోధనకు పెద్దపీట
బెంగళూరులో ఓ విశ్వవిద్యాలయంలో దేశ విదేశీ విద్యార్థులు (ఫైల్)
తుమకూరు: పెళ్లయిన 4 నెలలకే నూతన జంట ఆత్మహత్య చేసుకుంది. వందేళ్లు సుఖ సంతోషాలతో జీవించాలన్న పెద్దల దీవెనలు ఫలించలేదు. తుమకూరు జిల్లా శిర తాలూకాలోని హనుమానహళ్లిలో శరణ్య (20), గిరీష్ (28) ప్రాణాలు తీసుకున్నారు. పొరుగూరు సిద్ధనహళ్లి గ్రామానికి చెందిన శరణ్య డిగ్రీ చదువుతోంది. ఇటీవల ఆమెకు తల్లి సోదరుని కుమారుడైన గిరీష్‌తో వివాహం చేశారు. కొత్త సంసారం సజావుగా సాగుతోంది. సోమవారం అత్తమామలు, భర్త పత్తి విత్తనాలు వేసేందుకు పొలానికి వెళ్లారు. సాయంత్రం భర్త ఇంటికి వచ్చి పిలిచాడు. స్పందన రాకపోవడంతో, కిటికీలో నుంచి చూడగా, శరణ్య ఉరికి వేలాడుతూ కనిపించడంతో గిరీష్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. తీవ్ర భయాందోళన చెంది పొలంలోని చెట్టుకు అతడూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యలకు గల కచ్చితమైన కారణం తెలియరాలేదు. పట్టణాయకనహళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులు, బంధువుల రోదనలతో గ్రామంలో విషాదం నెలకొంది.
మూడుముళ్ల బంధాలకు గండి, లావణ్య, గిరీష్ (ఫైల్)
అమ్మా.. వారిని విడిచిపెట్టొద్దు
బనశంకరి: భర్త, ఆడపడుచు కట్న వేధింపులను భరించలేక నవవివాహిత ప్రాణాలు తీసుకుంది. బెంగళూరు కామాక్షీపాళ్య పోలీస్‌స్టేషన్ పరిధిలో శ్వేత (25) మృతురాలు. చిక్కమగళూరుకు చెందిన శ్వేతకు, స్థానికుడు మూర్తితో పెళ్లయింది. పెద్దమొత్తంలో కట్నకానుకలు ఇచ్చారు. హెగ్గేనహళ్లి క్రాస్‌లో అద్దె ఇంట్లో దంపతులు నివాసం ఉంటున్నారు. శ్వేత ప్రైవేటు టీచరుగా పనిచేసేది. మరింత కట్నం తేవాలని భర్త, బంధువులు ఆమెను సతాయించేవారు. ఆదివారం ఉదయం రగడ జరగ్గా, శ్వేత తాను ఇక్కడ ఉండలేనని, పీజీ హాస్టల్‌లో ఉంటానని చెప్పి వెళ్లిపోయింది. ఆమె తల్లి ఫోన్ చేసి సర్దిచెప్పడంతో మధ్యాహ్నం 2:30కు ఇంటికి వచ్చింది. అర్ధరాత్రి తన బాధను పేపరుపై రాసిపెట్టి, ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
వారిని వదలిపెట్టకండి
తన చావుకు తన భర్త, అతడి అక్క కారణమని వారు నాకు చిత్రహింసలకు గురిచేశారని, వారి వల్ల విరక్తి చెందానని, నేను చనిపోయినా వారిని మాత్రం వదిలిపెట్టద్దు అమ్మ, నా వల్ల తప్పు జరిగింది, క్షమించు, ఇట్లు, ప్రేమతో, మీ కుమార్తె అని గుండెలోని ఆవేదనను డెత్‌నోట్‌లో రాసింది. 4 నెలల కిందటే ఘనంగా పెళ్లిచేశామని, తన కూతురిని చంపేశారని తల్లి రోదించింది. భర్త మూర్తి, సోదరి నరసమ్మను పోలీసులు అరెస్ట్ చేశారు.
కర్ణాటకకు అత్యధికంగా రాక
దేశంలోనే ప్రథమ స్థానం
ఏఐఎస్‌హెచ్‌ఈ సర్వేలో వెల్లడి
డెత్‌నోట్ రాసి, నవ వివాహిత
బలవన్మరణం
నేపాలీయులు ఎక్కువ
విద్యార్థుల్లో అత్యధికులు నేపాలీయులున్నారు. 24 శాతం మంది నేపాల్‌వాసులు కాగా, 7 శాతం యూఏఈ, 5.9 శాతం మంది అమెరికన్లు, 5.9 శాతం మంది బంగ్లాదేశీయులు, 5.5 శాతం మంది నైజీరియన్లు, 4 శాతం మంది జింబాబ్వేవాసులకు చదువు లభిస్తోంది. లెబనాన్, మంగోలియా, మెక్సికో, కజకిస్తాన్, బెలారస్, చిలీ వంటి దేశాల నుంచి కూడా విద్యార్థులు భారత్‌కు వస్తున్నారు. ఇలా 58,134 మంది విదేశీ విద్యార్థులు దేశంలోని వివిధ యూనివర్సిటీలు, కాలేజీలు, విద్యా సంస్థల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు.


