కుమారున్ని చంపి, తల్లి బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

కుమారున్ని చంపి, తల్లి బలవన్మరణం

Jul 14 2026 1:12 AM | Updated on Jul 14 2026 1:12 AM

దొడ్డబళ్లాపురం: భర్త ఇంట్లో వారి వేధింపులు తాళలేక తల్లి, కుమారునితో కలిసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెళగావి గ్రామీణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పీరనవాడి పాటిల్‌ కాలనీలో జరిగింది. ప్రేమ (28), కుమారుడు భువన్‌(3) మృతులు. భర్త, అత్తమామలు ఆమెను పుట్టింటి నుంచి రూ.10 లక్షలు తెచ్చివ్వాలని హింసించేవారు. ఇది తట్టుకోలేక, తాను చనిపోతే కొడుకు అనాథ అవుతాడని మొదట అతనికి ఉరివేసి, తాను ఉరి బిగించుకుంది. తన చావుకు భర్త, అత్త, మరిదితో పాటు మొత్తం ఆరుమంది కారణమని డెత్‌నోట్‌ రాసింది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement