రోప్‌వే పథకాలు ఎక్కడివక్కడే | - | Sakshi
Sakshi News home page

రోప్‌వే పథకాలు ఎక్కడివక్కడే

Jul 14 2026 1:12 AM | Updated on Jul 14 2026 1:12 AM

బనశంకరి: రాష్ట్రంలో 13 రోప్‌ వే పథకాలను త్వరితగతిన పూర్తి చేయాలని పర్యాటక శాఖ మంత్రి కేజే.జార్జ్‌ అధికారులను ఆదేశించారు. సోమవారం పర్యాటక శాఖ కార్యదర్శి డాక్టర్‌ కేవీ.త్రిలోక్‌చంద్ర తదితరుతో సమీక్ష జరిపారు. ప్రతిపాదిన రోప్‌ వే పథకాల గురించి చర్చించారు. ఏళ్ల తరబడి ప్రస్తావనలుగానే మిగిలిపోయాయని ఆగ్రహించారు. టెండర్ల ఆహ్వానం, అటవీ, ఇతర శాఖల నుంచి అనుమతులు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలో 13 రోప్‌వే పథకాల నివేదికలను సిద్ధం చేయాలని రైట్స్‌ సంస్థకు అప్పగించాం, 8 పథకాల నివేదికలు పూర్తికాగా, మిగిలినవి త్వరలో పూర్తి చేయాలని సూచించారు. రోప్‌ వే పథకాల వల్ల పుణ్యక్షేత్రాలు, చారిత్రక, ప్రకృతి పర్యాటక ప్రాంతాలకు టూరిస్టుల రాక పెరుగుతుందన్నారు.

13 రోప్‌ వే పథకాలు ఇవే

మధుగిరి కోట–తుమకూరు జిల్లా, మల్లళ్లి జలపాతం–కొడగు, అంజనాద్రి బెట్ట–కొప్పళ, బళ్లారి కోట–బళ్లారి, నృపతుంగ బెట్ట–ధార్వాడ జిల్లా, యాదగిరికోట–యాదగిరి జిల్లా, మైలార లింగేశ్వర దేవస్థానం– యాదగిరి, హొళల ఆలయం– గదగ, కాలకాలేశ్వర ఆలయం– గదగ, సవదత్తి యల్లమ్మ ఆలయం–బెళగావి, దేవరగుడ్డ మాలతేశ ఆలయం– హావేరి, గోకాక్‌ జలపాతం–బెళగావి జిల్లా, ముళ్లయ్యనగిరి–చిక్కమగళూరు జిల్లాలో ఉన్నాయి.

త్వరగా పనులు ప్రారంభించాలని

మంత్రి సూచన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement