20 ఎకరాలలో కంబళ మడులు | - | Sakshi
Sakshi News home page

20 ఎకరాలలో కంబళ మడులు

Jul 14 2026 1:12 AM | Updated on Jul 14 2026 1:12 AM

మైసూరు: ప్రపంచ ప్రసిద్ధ మైసూరు దసరా ఉత్సవాలలో రెండు రోజుల కంబళ పోటీలను నిర్వహించాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. దీనిని జిల్లా ప్రముఖులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా పట్టించుకోవడం లేదు. మైసూరు శివార్లలో సతగల్లి సమీపంలో 20 ఎకరాల స్థలంలో నేలను చదును చేసే పని ఇప్పటికే ప్రారంభమైంది. 10కి పైగా జేసీబీ యంత్రాలతో బురద మడి తవ్వకాలు జరుపుతున్నారు. కానీ ఈ ప్రాంతం దట్టమైన పచ్చదనంతో నిండి ఉంది. వివిధ రకాల 150కి పైగా భారీ చెట్లు ఉన్నాయి. కానీ చెట్లను కొట్టివేయడం స్థానికులు, పర్యావరణవాదుల్లో ఆగ్రహం కలిగిస్తోంది. ప్రకృతిని నాశనం చేయవద్దని కోరుతున్నారు. అలాగే ఇక్కడ 6 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఒక పెద్ద చెరువు ఉంది. అరుదైన పక్షి జాతులకు ఆవాసంగా ఉంది. కంబళ కోసం నాశనం చేస్తారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

అటవీ అధికారుల ఫిర్యాదు

కంబళ కోసం గుర్తించిన సతగల్లి ప్రాంతంలో అధికారుల మధ్య గొడవలు వచ్చాయి. అనుమతి లేకుండా చెట్లు నరికారని యువజన సాధికారత శాఖ డిప్యూటీ డైరెక్టర్‌తో సహా ముగ్గురిపై అటవీ శాఖ అధికారులు కేసు పెట్టారు. వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది.

జేసీబీలతో అటవీ ప్రాంతం చదును

స్థానిక ప్రజల్లో వ్యతిరేకత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement