మహిళా రిజర్వేషన్లకు మద్దతివ్వాలి | - | Sakshi
Sakshi News home page

మహిళా రిజర్వేషన్లకు మద్దతివ్వాలి

Apr 12 2026 2:36 AM | Updated on Apr 12 2026 2:36 AM

బనశంకరి: చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ అందించే మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు పార్టీలకు అతీతంగా పార్లమెంటులో మద్దతు ఇవ్వాలని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే కోరారు. శనివారం బెంగళూరులో బీజేపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 15, 16 తేదీల్లో పార్లమెంటు ఉభయసభల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు గురించి ప్రత్యేక సమావేశం జరుగుతుందని తెలిపారు. రాజకీయ పార్టీలు లాభనష్టాలు ఆలోచించకుండా మద్దతు పలకాన్నారు. తద్వారా మహిళల దశాబ్దాల కల నెరవేరుతుందన్నారు. 15 ఏళ్ల క్రితం పార్లమెంటులో చర్చకు వచ్చినప్పుడు కొందరు ఎంపీలు రభస చేశారన్నారు, ఈసారి అలాంటివాటికి అవకాశం ఉండదన్నారు. కాంగ్రెస్‌ నాయకులకు మహిళ అంటే ప్రియాంకాగాంధీ మాత్రమేనా, వేరే మహిళలు ఎన్నిక కాకూడదా? అని విమర్శించారు. పార్టీ నాయకురాళ్లు మాళవిక అవినాశ్‌, రూపాలి నాయక్‌, సురభి హొదిగెరె తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి శోభ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement