సాక్షి, బళ్లారి: విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడిగా మారాడు. 16 సంవత్సరాల బాలికపై లైంగిక దాడి చేయడంతో.. గర్భం దాల్చింది. చిత్రదుర్గం జిల్లా చెళ్లకెరెలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. చెళ్లకెరెలోని ఒక ఉన్నత ప్రాథమిక పాఠశాలలో హెచ్.ఓ.రాజణ్ణ గణిత ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. పాఠశాల గది లోపలే ఆ విద్యార్థినిపై నిరంతరం లైంగిక వేధింపులకు పాల్పడటం వల్ల బాలిక గర్భం దాల్చింది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిస్తే సమస్య అవుతుందని భావించిన ఉపాధ్యాయుడు రాజణ్ణ.. బాలికకు అబార్షన్ (గర్భస్రావం) చేయించాలని ప్లాన్ వేశాడు. వెంటనే చెళ్లకెరెలోని లక్ష్మీ శ్రీనివాస నర్సింగ్ హోంకు చెందిన డాక్టర్ శంకర లక్ష్మితో మాట్లాడారు. బాలికను అక్కడికి తీసుకెళ్లి మాత్రలు ఇచ్చి గర్భస్రావం చేయించాడు. ఇటీవల బాలిక శరీరంలో వస్తున్న మార్పులను గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లగా అబార్షన్ విషయం బయటపడింది.
పోక్సో కేసు నమోదు
ఈ విషయం తెలుసుకున్న బాలల సంరక్షణ అధికారిణి రేఖ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చెళ్లకెరె తాలూకా పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదైంది. ఈ ఫిర్యాదు ఆధారంగా కామ ఉపాధ్యాయుడు రాజణ్ణ, అతడికి సహకరించిన డాక్టర్ శంకర లక్ష్మిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు.
లైంగిక దాడి చేయడంతో
బాలికకు గర్భం
పోక్సో కేసు నమోదు


