ఇంకా చాలా మందే అక్కడ ఉన్నారు.! | - | Sakshi
Sakshi News home page

ఇంకా చాలా మందే అక్కడ ఉన్నారు.!

Apr 11 2026 9:34 AM | Updated on Apr 11 2026 9:34 AM

కాంబోడియా, వియత్నాంలో చైనీస్‌ హ్యాకింగ్‌ ముఠాల చేతుల్లో చిక్కుకుని రాష్ట్రంలోని కొప్ప, బాళెహొన్నూరు, చిక్‌మగళూరు, కోలారుకు చెందిన 10–15 మంది యువకులను కాపాడి రాష్ట్రానికి తరలించామని, ఇతర రాష్ట్రాలకు చెందిన యువకులు ఇంకా చాలా మంది అక్కడ ఉన్నట్లు సమాచారం అందిందని ఎమ్మెల్సీ డాక్టర్‌ ఆరతి కృష్ణ తెలిపారు. విదేశాల్లో సులభంగా ఉద్యోగం లభిస్తుందనే ఆశతో యువకులు అక్కడికి వెళ్లి చీకటి గదుల్లో మగ్గిపోయే పరిస్దితి తెచ్చుకుంటున్నారని ఆయన తెలిపారు. ఉద్యోగాల ఆశ చూపించి విదేశాలకు తీసుకెళ్లి వంచనకు పాల్పడే నకిలీ ఏజెంట్లు, సంస్థల ఆచూకీ కనిపెట్టే కేంద్రప్రభుత్వం, ఈ–మైగ్రేట్‌ పోర్టల్‌లో అప్‌డేట్‌ చేసింది. 2025 డిసెంబరు వరకు 3,505 నమోదు కానీ నకిలీ సంస్థల జాబితాను పోర్టల్‌లో ప్రకటించింది. ఆ జాబితాను పరిశీలించుకుని నకిలీ ఏజెన్సీల పట్ల జాగ్రత్త వహించాలని ఎమ్మెల్సీ నిరుద్యోగ అభ్యర్థులకు సలహా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement