
మల్నాడు జిల్లాల్లో వాన హోరు
మండ్య జిల్లాలో కేఆర్‌ఎస్ డ్యాం నుంచి కావేరి పరుగు
చిక్కమగళూరులో జల్లులు
శివమొగ్గ: మల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. దీని కారణంగా నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. శివమొగ్గ జిల్లాలోని ప్రధాన జలాశయాలైన తుంగ, భద్ర, లింగనమక్కిలకు ఇన్‌ఫ్లో గణనీయంగా పెరిగింది. ఆగస్ట్ 18 ఉదయం నాటికి గజనూరులోని తుంగా రిజర్వాయర్ ఇన్‌ఫ్లో 73,415 క్యూసెక్కులు ఉంటే, 76,656 కూసెక్కులను విడుదల చేస్తున్నారు. దీంతో శివమొగ్గ నగరం గుండా తుంగా నది నిండుగా ప్రవహిస్తోంది. నీటి విడుదల మరింత పెరిగితే నగరంలోని నదికి అటు ఇటు ఉన్న ప్రాంతాలు మునిగిపోతాయనే భయం నెలకొంది.
ప్రమాదకరంగా భద్ర
మరో వైపు భద్ర డ్యాం ఇన్‌ప్లో 43,430 క్యూసెక్కులకు పెరిగింది. 39,245 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. భద్రావతి వద్ద నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. కొత్త వంతెన మునిగిపోవడంతో వాహనాలను నిషేధించారు. కలువగుండి ప్రాంతంలో కొన్ని ఇళ్లలోకి వాన నీరు ప్రవేశించింది. వారికి కమ్యూనిటీ హాల్‌లో ఆశ్రయం కల్పించారు. లింగనమక్కి ఆనకట్ట నిండుగా ఉంది. చిక్కమగళూరులో మూడురోజులుగా జోరువాన కురుస్తూనే ఉంది. విద్యార్థులు, చిరువ్యాపారులు ఇబ్బందులు పడ్డారు. మండ్య జిల్లాలో కృష్ణరాజసాగర జలాశయం నిండిపోవడంతో భారీ మొత్తంలో నీటిని వదిలేస్తున్నారు.
శివమొగ్గలో కుండపోత
శివమొగ్గ జిల్లాలో హొసానగర తాలూకాలోని పశ్చిమ కనుమల్లో భారీ వర్షాలు కురిశాయి. మణిలో 238 మిల్లీమీటర్లు, యాదూర్ 200 మిల్లీమీటర్లు, హులికల్ 220 మిల్లీమీటర్లు, మస్తికట్టె 204, చక్ర 150, సావెహక్లు ప్రాంతంలో 179 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లా అంతటా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ చేసింది. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి.
తుంగ, భద్ర నదులు ఉధృతం

మల్నాడు జిల్లాల్లో వాన హోరు

మల్నాడు జిల్లాల్లో వాన హోరు