
గృహిణి అనుమానాస్పద మృతి
హుబ్లీ: కాళ్లపారాణి ఆరక ముందే ఓ గృహిణి గోకుల్ రోడ్డు పోలీసు స్టేషన్ పరిధిలోని నందగోకుల లేఅవుట్‌లో అనుమానాస్పదంగా మృతి చెందారు. మృతురాలు జయశ్రీ బడిగేర్(31) ఆమె ఇంట్లో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈమె స్వగ్రామంలో గదగ్ జిల్లా హొళెఇటిగి కాగా హుబ్లీ నివాసి శివానందతో గత మే 21న వివాహం జరిగింది. ఉరి వేసుకున్న స్థితిలో ఆమె మృతదేహం లభ్యమైందని, ఆమె ఆత్మహత్య చేసుకొలేదని, హత్య చేసి ఇలా నాటకం ఆడుతున్నారని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా భర్త శివానందను ఈ కేసులో అరెస్ట్ చేశారు. పెళ్లికి ముందు శివానంద తన ప్రేమ వ్యవహారాన్ని దాచి పెట్టారని, ఇదే విషయమై తరచు ఘర్షణలు, వేధింపులకు పాల్పడే వారని మృతురాలి బంధువులు ఆరోపించారు. జయశ్రీ మృతదేహాన్ని కిమ్స్ మార్చురీకి తరలించారు. ఆస్పత్రి ఎదుట మృతురాలి బంధువులు కన్నీరుమున్నీరైన వైనం చూపరులను కలిచి వేసింది.
దుష్ప్రచారకులపై
చర్యలు తీసుకోండి
హుబ్లీ: ధర్మస్థలపై భారీ స్థాయిలో కుట్ర జరుగుతోందని, దుష్ప్రచారం చేసే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని వరూరు నవగ్రహ తీర్థ క్షేత్రం గుణధర నంది మహారాజ్ ప్రభుత్వంపై మండిపడ్డారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ దర్యాప్తునకు ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం మంచిదేనని, దీని వల్ల సత్యాలు బయటకు వస్తాయి. అయితే ఈ విషయంతో పాటు కుట్రలపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎలాంటి ఉగ్రవాది అయినా 300 హత్యలు చేయడం అసాధ్యం అని, ఈ నేపథ్యంలో పలువురిపై అనేక ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణలు చేసిన వారి వ్యతిరేకంగా కూడా దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. దుష్ప్రచారమే ధ్యేయంగా పని చేస్తున్న కొందరు యూట్యూబర్లపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా వాటి నియంత్రణకు తగిన నియమావళి రూపొందించాలని ఆయన సూచించారు.
పైకప్పు పెచ్చులూడిన బస్టాండ్
రాయచూరు రూరల్: నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ పైకప్పు పెచ్చులూడి పడ్డాయి. గత కొన్ని రోజుల నుంచి వానలు కురుస్తుండడంతో సోమవారం అకస్మాత్తుగా పెచ్చులూడి పడ్డాయి. త్రుటిలో ప్రయాణికులు ప్రమాదం నుంచి బయట పడ్డారు. నగరం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రజలు బస్సుల కోసం వేచి ఉన్న సమయంలో పెచ్చులూడడంతో పిల్లలతో పాటు పెద్దలు భయభ్రాంతులకు గురయ్యారు.
సీనియర్లకు ప్రాధాన్యత ఇవ్వాలి
రాయచూరు రూరల్: సమాజంలో మార్పులకు అనుగుణంగా పురాతన కాలం నాటి సంస్కృతిని, ఆచారాలను అలవర్చుకొనేలా రాసిన పుస్తకాలకు, సీనియర్ సాహితీవేత్తలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆది కవి వాల్మీకి మహర్షి విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ శివానంద పేర్కొన్నారు. కన్నడ భవనంలో జిల్లా, తాలుకా కన్నడ సాహిత్య పరిషత్, కళా సంకుల సంస్థల ఆధ్వర్యంలో రేఖా బడిగేర్ రాసిన ఉద్దో యల్లమ్మ పుస్తకం విడుదల చేసి మాట్లాడారు. సాహితీవేత్త రాసిన పుస్తకాలు ప్రజల మన్ననలను పొందాయన్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు రంగణ్ణ పాటిల్, తాలూకా కన్నడ సాహిత్య పరిషత్ అధ్యక్షుడు వెంకటేష్ బేవినబెంచి, రావుత్‌రావ్, వీరహనుమాన్‌లున్నారు.

గృహిణి అనుమానాస్పద మృతి

గృహిణి అనుమానాస్పద మృతి