పీఓపీ వినాయక విగ్రహాలు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

పీఓపీ వినాయక విగ్రహాలు స్వాధీనం

Aug 19 2025 5:12 AM | Updated on Aug 19 2025 5:12 AM

పీఓపీ

పీఓపీ వినాయక విగ్రహాలు స్వాధీనం

హుబ్లీ: ధార్వాడ జిల్లా కుందగోళ పట్టణంలో తహసీల్దార్‌ రాజు నేతృత్వంలో ఆకస్మిక దాడి చేసిన టాస్క్‌ఫోర్స్‌ బృందం 10 పీఓపీ వినాయక విగ్రహాలను స్వాధీనం చేసుకుంది. ఆ విగ్రహాలను విక్రయిస్తున్నట్లు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విక్రయ కేంద్రాలపై దాడి చేశారు. ఈ మేరకు కిల్లా వీధిలో విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్‌ మాట్లాడుతూ స్వాధీనం చేసుకున్న విగ్రహాలను పట్టణ పంచాయతీ కార్యాలయంలో భద్రపరిచామన్నారు. విగ్రహాలను పరీక్షించి నివేదిక వచ్చాక తగిన చర్యలు తీసుకుంటామన్నారు. దాడిలో పట్టణ పంచాయతీ ముఖ్యాధికారి సీవీ కులకర్ణి, ఎస్‌ఐ ఇమ్రాన్‌ పఠాన్‌, ఆరోగ్య అధికారిణి జానకి బళ్లారి తదితరులు పాల్గొన్నారు.

26న వీరభద్రేశ్వర జయంతి ఉత్సవాలు

రాయచూరు రూరల్‌: దేశ వ్యాప్తంగా ఈ నెల 26న వీరభద్రేశ్వర జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు జాతీయ వీరశైవ సంఘం వేదిక సలహా సభ్యుడు జీజీ మనోహర్‌ తెలిపారు. ఆయన ఈమేరకు సోమవారం నగరంలో విడుదల చేసిన ఓ ప్రకటనలో సెప్టెంబర్‌ 15న న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో వీరభద్రేశ్వర అవార్డును అందజేస్తారన్నారు. 2021 నుంచి వీరభద్రేశ్వర అవార్డును ప్రకటించామన్నారు. 2021లో మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు, 2022లో బెళగావి ప్రభాకర్‌ కోరేకు, 2023లో ఇస్రో చైర్మన్‌ మనోహర్‌కు, 2024లో కేంద్ర రైల్వే శాఖ మంత్రి సోమన్నకు, 2025లో మాజీ ప్రధానమంత్రి దేవేగౌడకు ఇవ్వాలని తీర్మానించినట్లు తెలిపారు.

చదువుతో పాటు

క్రీడలూ అవసరమే

బళ్లారిఅర్బన్‌: చదువుతో పాటు ఆటపాటల్లో కూడా చురుగ్గా పాల్గొనాలని ఎస్‌ఎల్‌ఎన్‌ సేవా సంస్థ అధ్యక్షుడు, శ్రీధరగడ్డ జెడ్పీ ప్రముఖులు వై.షణ్ముఖ తెలిపారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల క్రీడా పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు యూనిఫాంలను పంపిణీ చేసి ఆయన మాట్లాడారు. గాంధీనగర డివిజన్‌ స్థాయి ఈ క్రీడా పోటీల్లో సంస్థ తరపున ఉచితంగా విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేశామన్నారు. ఆటల్లో పాల్గొనడం వల్ల శారీరకంగా దృఢంగా తయారవుతారని, విజేతలుగా నిలిచి తమ ఊరికి పేరు తేవాలని ఆయన క్రీడాకారులకు సూచించారు. ఆ పాఠశాల ప్రముఖులు ఎన్‌.వీరేష్‌, ఇన్‌చార్జి ప్రధానోపాధ్యాయిని సరస్వతి, మాలగడ్డ బాబు, పీఈటీ రాఘవేంద్ర, ఉమామహేశ్వరి శెట్టితో పాటు క్రీడాకారులు, విద్యార్థులు, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

గణేష్‌ మంటపాలకు

స్థల పరిశీలన

రాయచూరు రూరల్‌: నగరంలో ప్రశాంతంగా గణేష్‌ పండుగ ఆచరణ దిశగా నగరసభ కమిషనర్‌ జుబిన్‌ మహాపాత్రో మంటపాలకు స్థల పరిశీలన చేశారు. సోమవారం నగరంలోని వివిధ ప్రాంతాల్లో సంచరించి పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈనెల 27న వినాయకులను ప్రతిష్టాపించాలని 31న నిమజ్జనం చేయాలన్నారు. డీజేల ఏర్పాటును పూర్తిగా నిషేధించామన్నారు. రాత్రి 10 గంటల తరువాత డీజేలను వినియోగిస్తే కఠిన చర్యలు చేపడతామన్నారు. అదనపు ఎస్పీ కుమార స్వామి, డీఎస్పీ శాంతవీర, సీఐ ఉమేష్‌ కాంబ్లేలున్నారు.

స్వయం ఉపాధిపై

దృష్టి పెట్టాలి

రాయచూరు రూరల్‌ : సమాజంలో బతుకు తెరువుకు, జీవనోపాధికి, స్వయం ఉపాధిపై విద్యార్థులు దృష్టి సారించాలని హైదరాబాద్‌ కర్ణాటక విద్యా సంస్థల ఉపాధ్యక్షుడు రాజా భీమళ్లి పిలుపునిచ్చారు. సోమవారం కలబుర్గిలోని హైదరాబాద్‌ కర్ణాటక విద్యా సంస్థ, వీరమ్మ గంగసిరి మహిళా జూనియర్‌ కళాశాలలో అతిథిగా పాల్గొని మాట్లాడారు. సంస్కారాలతో పాటు జీవిత విలువలను అలవర్చుకోవాలన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి ఉదయ్‌ కుమార్‌, ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారి మహేష్‌, ప్రిన్సిపాల్‌ రాజేంద్ర కొండా, వీణా, మోహన్‌రాజ్‌, సుష్మా, ఉమా, రేణుకలున్నారు.

పీఓపీ వినాయక  విగ్రహాలు స్వాధీనం 1
1/2

పీఓపీ వినాయక విగ్రహాలు స్వాధీనం

పీఓపీ వినాయక  విగ్రహాలు స్వాధీనం 2
2/2

పీఓపీ వినాయక విగ్రహాలు స్వాధీనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement