
పుష్పరాశులకు ఇక సెలవు
● లాల్‌బాగ్ ఫ్లవర్ షో సమాప్తం
బనశంకరి: స్వాతంత్య్రదినోత్సవం సందర్భంగా బెంగళూరు లాల్‌బాగ్‌లో గత 11 రోజులుగా నిర్వహిస్తున్న వీరనారి రాణి కిత్తూరు చెన్నమ్మ, క్రాంతివీర సంగోళ్లి రాయణ్ణ థీమ్ ఫల పుష్ప ప్రదర్శన సోమవారం సాయంత్రంతో సమాప్తమైంది. ఆదివారం నాటికి 5.80 లక్షల మందికి పైగా వీక్షించారు. టికెట్ల ద్వారా రూ.2.50 కోట్లపైగా వసూలైంది. గత మూడు రోజులుగా సెలవులు రావడంతో లాల్‌బాగ్ కిటకిటలాడింది. అప్పుడప్పుడు వర్షాల వల్ల కొద్దిగా సందడి తగ్గింది. పుష్ప సౌందర్యాలను ఫోటోలు తీస్తూ సందడి చేశారు. మళ్లీ పుష్ప ప్రదర్శన గణతంత్ర దినోత్సవాల సందర్భంగా జనవరిలో జరుగుతుంది.