రాయచూరు రూరల్: వారం రోజలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా అన్నదాతలకు అపార నష్టం కలిగింది. పలుచోట్ల ఇంటి గోడలు కూడా పేదలు నిరాశ్రయులుగా మారారు. కళ్యాణ కర్ణాటకలోని యాదగిరి, కలబుర్గి, రాయచూరు, బీదర్ జిల్లాల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పెసలు, కంది, ఉల్లి, మొక్కజొన్న పంట పొలాల్లో నీరు చేరింది. తేమ ఎక్కువ కావడంతో పంటలు కుళ్లిపోతున్నాయి. లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టి పంటలను కంటికి రెప్పలా కాపాడుకున్నామని, వర్షాలతో పంటలు చేతికందే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. కలబుర్గి జల్లా అప్జల్ పూర్ తాలుకా బోస్కలో ఇంటి గోడ కూలి లక్ష్మీ బాయి(55) అనే మహిళ మృతి చెందింది. బెళగావి జిల్లా సవదత్తి యల్లమ్మ ఆలయంలోకి వరద నీరు చేరడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
పంటలు నీటిపాలు.. అన్నదాతలు కుదేలు
పంటలు నీటిపాలు.. అన్నదాతలు కుదేలు
పంటలు నీటిపాలు.. అన్నదాతలు కుదేలు
పంటలు నీటిపాలు.. అన్నదాతలు కుదేలు