
యత్నాళ్ వ్యాఖ్యలపై నిరసన
సాక్షి,బళ్లారి: ముస్లిం యువతులను పెళ్లి చేసుకునే హిందూ యువకులకు రూ.5 లక్షల ప్రోత్సహం ధనం ఇస్తామని ప్రకటించిన ఎమ్మెల్యే బసవన్నగౌడ పాటిల్ యత్నాళ్ వ్యాఖ్యలపై ముస్లిం యువకులు మండిపడ్డారు. విజయపుర జిల్లా హాలమేళ పట్టణంలో నల్లవస్త్రాలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. సదరు గ్రామంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే యత్నాళ్ వాహనం ర్యాలీగా వెళుతుండగా బైక్‌లో వచ్చిన ముస్లిం యువకులు నల్లజెండాలు ప్రదర్శించి ఆక్రోషం వెల్లగక్కారు. అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీంతో ముస్లిం మహిళలు పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహించారు.