
మానవీయ విలువలు పెంచేలా బోధన
రాయచూరు రూరల్: విద్యార్థుల్లో మానవీయ విలువలు పెంచేలా బోధన చేయాలని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజ్, ఎమ్మెల్యే శివరాజ పాటిల్‌లు ఉపాధ్యాయులకు సూచించారు. నగరంలోని పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందరింలో అవోపా సంఘం ఏర్పాటు చేసిన ప్రతిభాపురస్కార ప్రదానోత్సవంలో వారు పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థానాల్లో స్థిరపడాలన్నారు. పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలన్నారు. అనంతరం టెన్త్, పీయూసీలో ప్రతిభ చాటిన విద్యార్థులకు పురస్కారాలు ప్రదానం చేశారు. అవోపా రాష్ట్ర అధ్యక్షుడు కోర వెంకటేష్, పురుషోత్తం, లక్ష్మిపతి, జగదీష్, హనుమేష్, తిప్పయ్య , కిశోర్, దత్తాత్రేయ, భీమాశంకర్, శశిరాజ్ పాల్గొన్నారు.
సంగీత, సాహిత్య కళలను పోషించాలి
రాయచూరు రూరల్: సంగీత, సాహిత్య కళలను సైకళా సంసకుల సంస్థ పోషిస్తుండటం అభినందనీయమని మాజీ మంత్రి శివనగౌడ నాయక్ అన్నారు. పండిత సిద్దరామ జంబల దిన్ని రంగమందిరంలో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సాహిత్యం, సంగీతం, కళలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు. సమాజానికి సేవలు అందించేవారిని ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో విధానపరిషత్ సభ్యుడు వసంత కుమార్, సంస్థకు చెందిన మారుతీ, రేఖ, శ్రీదేవి, శరణ బసవ, చెన్న బసవ, అస్లాం పాషా, అబ్దుల్ ఖరీం, నిజాముుద్దీన్, జాపర్ అలీ పటేల్ పాల్గొన్నారు.
ప్రభుత్వ లాంఛనాలతో
అంత్యక్రియలు
రాయచూరురూరల్: శరణ పరంపరకు చెందిన శరణ బసవేశ్వర ఆలయ 8 వ పీఠాధిపతి శరణ బసవప్ప అప్ప అంత్య సంస్కారాలు శుక్రవారం కలబురిగిలో ప్రభుత్వ లాంచనాలతో వీరశైవ లింగాయత్ విధివిధానాల మధ్య నిర్వహించారు. సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరై శరణ బసవప్ప అప్పకు నివాళులర్పించారు.
ప్రజలకు సరైన సమాచారం ఇవ్వాలి
రాయచూరురూరల్: సమాచార హక్కు చట్టం కింద ప్రజలు కోరిన సమాచారం ఇవ్వకపోతే ఆయా శాఖలు అర్జీదారులకు జరిమానా చెల్లించాల్సి వస్తుందని రాష్ట్ర సమాచార హక్కు కమిషన్ అధికారులు రుద్రణ, రాజశేఖర్ అన్నారు. శనివారం జెడ్పీ కార్యాలయంలో జరిగిన సభలో ప్రజలనుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజలు అందించిన అర్జీలకు సరైన సమాధానం ఇవ్వాలన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే ప్రతి రోజు జరిమాన కింద రూ.వంద నుండి 250 వరకు అర్జిదారుడికి చెల్లించాల్సి వస్తు ందన్నారు. మరింత జాప్యం చేస్తే రూ.25 వేల వరకు జరిమానా పడుతుందన్నారు. అదనపు జిల్లాధికారి శివానంద పాల్గొన్నారు.
చిన్నప్పటినుంచే
సంస్కారం నేర్పాలి
రాయచూరు రూరల్: సమాజంలో మానవుడికి సంస్కారం నేర్చుకోవడానికి లింగ దీక్ష ఆవశ్యమని కిల్లే బృహన్మఠం మఠాధిపతి శాంత మల్లశివాచార్యులు అన్నారు. మఠంలో ఆదివారం జంగమ వటులకు లింగ దీక్ష చేయించారు. చిన్నప్పటినుంచే సంస్కారం, సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించాలన్నారు.
రూ.20 కోట్లతో
చిక్క తిరుపతికి హంగులు
మాలూరు: తాలూకాలోని చిక్కతిరుపతి శ్రీ ప్రసన్న వేంకటరమణస్వామి దేవాలయాన్ని రూ. 20 కోట్లతో అభివృద్ధి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే కైవె నంజేగౌడ తెలిపారు. దేవాలయం వద్ద నిర్మిస్తున్న 108 అడుగుల రాజగోపుర నిర్మాణ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ దేవాలయం రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధి పొందిందని, వేల సంఖ్యలో భక్తులు వస్తున్నారు. సౌకర్యాల కొరత ఉందని, దేవదాయ శాఖ మంత్రి రామలింగారెడ్డి సహకారంతో భక్తులకు సౌలభ్యాలను కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. బ్రహ్మ రథోత్సవం నాటికి రథం వీధిని రూ. 2.5 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తామన్నారు. స్నానఘట్టాలు, శౌచాలయాలను నిర్మిస్తామన్నారు. 50కి పైగా విశ్రాంతి గృహాలను, 150 దుకాణాలను నిర్మాణం చేపడుతున్నామన్నారు. రామమూర్తి, ఎంఎ కృష్ణారెడ్డి , దేవాలయం ఈఓ టి సెల్వమణి తదితరులు పాల్గొన్నారు.

మానవీయ విలువలు పెంచేలా బోధన