హొసపేటె: ధర్మస్థాపనకే శ్రీ కృష్ణుడు అవతరించారని కన్నడ, సాంస్కృతిక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సిద్దలింగేష్ రంగన్నవర్ అన్నారు. నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహించిన శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. మానవ జీవితంలోని అన్ని అంశాలలో శ్రీకృష్ణుడి సహకారం ఉంటుందన్నారు. మార్గదర్శిగా, స్నేహితుడిగా, అన్నయ్యగా, గురువుగా, కుమారుడిగా , వీరుడిగా దర్శనమిస్తాడని తెలిపారు. హోస్పేట తాలూకా యాదవ, గొల్లర సంఘం గౌరవాధ్యక్షుడు గోని బసప్ప, నాయకులు బి.ఈరన్న, జి.శ్రీనివాసులు, వైబి.మధుసూధన్, మారుతితో పాటు సంఘం నాయకులు పాల్గొన్నారు.
ఘనంగా కృష్ణాష్టమి
హుబ్లీ: కృష్ణాష్టమి సందర్భంగా ఆదివారం కూడా నగరంలో పలుచోట్ల ఉట్టి కొట్టే కార్యక్రమాలు సందడిగా సాగాయి. గోకుల్ రోడ్డు అక్షయ పార్క్ మైదానంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉట్టి కొట్టే పోటీలను నిర్వహించగా యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి ఉట్టి కొట్టడాన్ని వీక్షించారు. తెలుగు పాత హుబ్లీ అరవింద నగర్‌లో హుబ్లీ సవితా సమాజం ఆధ్వర్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సవితా సమాజ బాంధవులు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర పద్మవతి ఆలయంలో ప్రత్యేక పూజలను నెరవేర్చారు.
హుబ్లీ: స్థానిక ఆనంద్ నగర్ చెందిన పలువురు తెలుగింటి ఆడపడుచులు తమ మెట్టినిల్లు తెలంగాణలోని నారాయణపేట జిల్లా ధనువాడలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. చిన్నారులకు రాధాకృష్ణుడు వేషధారణ వేయించి మురిసిపోయారు.
ధర్మస్థాపనకే శ్రీకృష్ణ అవతారం