
తుంగభద్ర గేట్ల ఏర్పాటులో అంతులేని నిర్లక్ష్యం
సాక్షి,బళ్లారి: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల పరిఽధిలో పలు జిల్లాలకు తాగు, సాగునీరందించే తుంగభద్ర జలాశయంలో గేట్ల ఏర్పాటు విషయంలో పాలకులు, అధికారులు నిర్లక్ష్యంగా వ్యహరించడం ఈ ప్రాంత రైతులకు శాపంగా మారిందని రైతు సంఘం నేతలు హనుమనగౌడ, మాధవరెడ్డి విరుచుకుపడ్డారు. నగరంలోని పత్రికా భవన్‌లో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. గత ఏడాది తుంగభద్ర 19వ క్రస్ట్ గేటు కొట్టుకుపోయిందన్నారు. తాత్కాలిక గేటు ఏర్పాటుతో పంటలు చేతికందాయన్నారు. అయితే మిగతా 32 గేట్లు దుస్థితిలో ఉన్నాయని, వాటిని మార్చాలని నిపుణులు కమిటీ సూచించినప్పటికీ పాలకులు, అధికారులు జాప్యం చేశారన్నారు. ఫలితంగా ఆ గేట్లు ఇప్పుడు మొరాయిస్తున్నాయని, పైకి ఎత్తితే దించడానికి, దించితే ఎత్తడానికి రాని దుస్థితి నెలకొందన్నారు. మూడు రాష్ట్రాల పాలకుల నిర్లక్ష్యం వల్ల కొత్త గేట్ల అమరికలో విపరీతమైన జాప్యం జరిగిందన్నారు. డ్యాంలో ఏటేటా పెరిగిపోతున్న ౖపూడిక గురించి ఆలోచించడం లేదన్నారు. డ్యాంలో ప్రస్తుతం 30 టీఎంసీల మేర పూడిక చేరిందన్నారు. దీంతో దామాషా ప్రకారం రైతులకు నీరు తగ్గించేశారని ఆవేదన వ్యక్తంచేశారు. ఓ వైపు పూడిక వల్ల 30 టీఎంసీలు తగ్గిపోగా, కొత్త గేట్ల అమరికలో జాప్యం వల్ల ఈ ఏడాది మరో 20 టీఎంసీల నీటి నిల్వ తగ్గిందన్నారు. 80 టీఎంసీలకు నీటి నిల్వ పరిమితం చేశారన్నారు. తుంగభద్ర ఆయకట్టు పరిధిలో రైతులు సమస్యలు తరుపున గట్టి పోరాటం చేస్తామని, అధ్వానంగా ఉన్న గేట్లును వెంటనే మార్చాలని, పూడిక తీత గురించి గట్టి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మండిపడిన రైతు సంఘం నేతలు