
బాధిత కుటుంబానికి పరిహారం పంపిణీ
రాయచూరు రూరల్: రాయచూరు తాలూకా యరగేరలో వారం రోజుల క్రితం పిడుగుపాటుకు గురై మృతి చెందిన భవాని కుటుంబానికి శనివారం రాయచూరు రూరల్ శాసన సభ్యులు బసనగౌడ దద్దల్ రూ.5 లక్షల పరిహార ధనం చెక్‌ను అందించారు.
పల్లెల్లో పచ్చదనం
పెంపొందించండి
రాయచూరు రూరల్: గ్రామాల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని గ్రామీణ సీఐ నింగప్ప పేర్కొన్నారు. శనివారం తాలూకాలోని ఆదికవి వాల్మీకి మహర్షి విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన ఎన్‌ఎన్‌ఎస్ శిబిరంలో ఆయన మాట్లాడారు. యువకులు నేరాలు, వ్యసనాలు, మత్తు పదార్థాల నుంచి దూరంగా ఉండి మంచి ప్రవర్తనతో విద్యాభ్యాసం చేసి ఉన్నత శిఖరాలకు చేరాలని పిలుపునిచ్చారు. గ్రామాలను పచ్చని చెట్లతో కళకళలాడేలా తీర్చిదిద్ది పచ్చని పల్లెలుగా మార్చాలన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఎన్‌ఎస్ అధికారిణి పద్మజ, బజారప్ప, రేణుక, బుజ్జమ్మ, శివరాజ్, నాగవేణి, విజయ్‌లున్నారు.
సంగొళ్లి రాయణ్ణ
ఆశయాలు అలవర్చుకోవాలి
రాయచూరు రూరల్: నేటి ఆధునిక సమాజంలో అణగారిపోతున్న ఆశయాలు, ఆదర్శాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని జిల్లాధికారి నితీష్ అన్నారు. జిల్లాధికారి కార్యాలయంలో జిల్లా పాలనా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, నగరసభ, సాంఘీక సంక్షేమ శాఖ, కన్నడ సంస్కృతి శాఖల ఆధ్వర్యంలో జరిగిన క్రాంతివీర సంగొళ్లి రాయణ్ణ జయంతిని పురస్కరించుకొని చిత్ర పటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. దేశంలో కుల, మత, వర్గ, వర్ణ వ్యవస్థ నిర్మూలనకు కృషి చేయాలన్నారు. ఏడీసీ శివానంద, తహసీల్దార్ సురేష్ వర్మ, నాసీర్ అహ్మద్‌లున్నారు.

బాధిత కుటుంబానికి పరిహారం పంపిణీ

బాధిత కుటుంబానికి పరిహారం పంపిణీ