
శ్రీకృష్ణ ఆదర్శాలు అనుసరణీయం
రాయచూరు రూరల్: అణగారిపోతున్న నేటి ఆధునిక సమాజంలో శ్రీకృష్ణ పరమాత్ముని ఆశయాలు, ఆదర్శాలను ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్ అన్నారు. శనివారం శ్రీకృష్ణ యాదవ భవనంలో జిల్లా యంత్రాంగం, జిల్లా పంచాయతీ, నగరసభ, సాంఘీక సంక్షేమ శాఖ, కన్నడ సంస్కృతి శాఖల ఆధ్వర్యంలో జరిగిన శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకొని చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. దేశంలో కుల, మత, వర్గ, వర్ణ వ్యవస్థల నిర్మూలనకు ప్రథమ ప్రాధాన్యత కల్పించారన్నారు. నగరేశ్వర ఆలయం నుంచి శ్రీకృష్ణ భగవాన్ చిత్రపటానికి భెమ్మెల్సీ వసంత్ కుమార్ జాతాను ప్రారంభించారు. కార్యక్రమంలో నగరసభ మాజీ అధ్యక్షుడు తిమ్మప్ప నాడగౌడ, శరణప్ప, బిచ్చన్న, భీమన్న, హనుమంతప్ప, చెన్నారెడ్డిలున్నారు.