
గుండెల నిండా జెండా
మండ్య: రోటరీ మండ్య, నెగిలయోగి సమాజ సేవాట్రస్టు తదితర పలు సంఘ సంస్థల ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా గురువారం మండ్య నగరంలో బృహత్ త్రివర్ణ ర్యాలీ సాగింది. నగర శక్తి దేవత అయిన శ్రీకాళికాంబ దేవాలయం వద్ద మూడు రంగుల యాత్రను జిల్లా ఎస్పీ మల్లికార్జున బాలదండి ప్రారంభించారు. ఆలయం నుంచి మొదలైన ర్యాలీలో యువతీ యువకులు, ప్రజలు 790 అడుగుల పొడవైన జెండాను పట్టుకుని భరతమాతకు జైకారాలు కొడుతూ ముందుకు సాగారు. 800 మందికిపైగా విద్యార్థులు, వందలాది ప్రజలు పాల్గొన్నారు. అలాగే బెళగావిలో భారీ ఎత్తున త్రివర్ణ ర్యాలీ జరిగింది.
పలుచోట్ల బృహత్ తిరంగా ర్యాలీలు

గుండెల నిండా జెండా