
మువ్వన్నెల గజరాజులు
● మైసూరులో స్వచ్ఛత, త్రివర్ణ ర్యాలీ
మైసూరు: 79వ స్వాతంత్య్ర దినోత్సవం, ఇంటింటా మువ్వన్నెల జెండా యాత్ర సందర్భంగా గురువారం మైసూరులో మహానగర పాలికె, దసరా గజపడె ఆధ్వర్యంలో స్వచ్ఛతపై జాగృతి జాతా నిర్వహించారు. ఏనుగుల మీద త్రివర్ణ పతాకాలను పట్టుకుని సాగుతూ ఉంటే నగరవాసులు ఆశ్చర్యంగా వీక్షించారు. ప్యాలెస్ కోటె ఆంజనేయ స్వామి గుడి నుంచి బయల్దేరి కేఆర్ ఆస్పత్రి సర్కిల్ వరకు సాగి తిరిగి ప్యాలెస్‌కు చేరుకున్నాయి. గజపడెతో పాటు పాలికె, అటవీ, పోలీసు సిబ్బంది, ప్రజలు త్రివర్ణ పతాకాలతో పాల్గొన్నారు.

మువ్వన్నెల గజరాజులు