
ధర్మస్థల మీద కుట్ర తగదు
● కోలారులో ఆందోళన
కోలారు: ధర్మస్థల శ్రీ మంజునాథ స్వామి ఆలయం మీద జరుగుతున్న దుష్ప్రచారాన్ని నిలిపివేయాలంటూ గురువారం బీజేపీ కార్యకర్తలు, భక్తులు, అభిమానుల వేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు భారీ నిరసన నిర్వహించారు. ధర్మస్థలకు, వీరేంద్ర హెగ్డేకు చెడ్డ పేరు తీసుకురావాలని కొందరు కుట్రలు చేస్తున్నారు. భక్తుల మనోభావాలను కించపరిచేలాగా ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసి విచారణ చేయించడం సమంజసం కాదన్నారు. దుష్ప్రచారం చేసేవారు విదేశాలు, పాకిస్తాన్ ఏజెంట్లతో కుమ్మక్కు అయ్యారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక విధానాలను అనుసరిస్తోందని దుయ్యబట్టారు. కలెక్టరేటులో వినతి పత్రం సమర్పించారు. ప్రతిఘటనలో ఎంపీ మల్లేష్‌బాబు, మాజీ ఎంపీ మునిస్వామి, కెవి శంకరప్ప, ఓం శక్తి చలపతి, సిఎంఆర్ శ్రీనాథ్, తదితరులు పాల్గొన్నారు.