
చెరువులో పడి ఇద్దరు బాలల మృతి
హొసపేటె: తాలూకాలోని బిజకల్ గ్రామ శివార్లలోని చెరువులో పడి ఇద్దరు పిల్లలు మరణించిన విషాద సంఘటన సోమవారం మధ్యాహ్నం జరిగింది. మృతులను గ్రామానికి చెందిన మల్లమ్మ(11), శ్రావణ్‌కుమార్(8)గా గుర్తించారు. కుటుంబ సభ్యులతో కలిసి పొలానికి వెళ్లిన పిల్లలు ఎవరూ లేని సమయంలో చెరువు వద్దకు వెళ్లారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువు నీటితో నిండింది. ఇద్దరు పిల్లలు ప్రమాదవశాత్తు చెరువులో పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పిల్లలు నీటిలో పడిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే గాలించి పిల్లలను బయటకు తీసి కుష్టగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యుడు డాక్టర్ మనోజ్ వారు అప్పటికే మరణించినట్లు నిర్థారించారు. నీలప్ప తెగ్గినమని, సంగప్ప తెగ్గినమని అనే ఇద్దరు సోదరుల పిల్లల మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యులు షాక్‌కు గురయ్యారు. ఆస్పత్రిని సందర్శించిన అక్కడి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
లోపాలు సవరించండి
రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు ఏబీసీడీ వర్గీకరణకు జిస్టిస్ నాగమోహన దాస్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో లోపదోషాలను నివారించి అసెంబ్లీ సమావేశాల్లో జారీకి తీర్మానం చేసుకోవాలని ఎస్సీ వర్గీకరణ చలువాది పోరాట సమితి సంచాలకుడు రవీంద్రనాథ్ పట్టి పేర్కొన్నారు. మంగళవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏబీసీడీ వర్గీకరణకు కాంగ్రెస్ సర్కార్ జిస్టిస్ నాగమోహన దాస్ అందించిన నివేదికపై విధానసభ సమావేశాల్లో చర్చించి తుది నిర్ణయం ప్రకటించాలన్నారు.
రాజీవ్ జ్యోతి సద్భావన యాత్రకు స్వాగతం
రాయచూరు రూరల్: నగరంలో సోమవారం రాజీవ్ జ్యోతి సద్భావన యాత్రకు ఘనస్వాగతం లభించింది. బెంగళూరు కేపీసీసీ నుంచి బయలు దేరిన జ్యోతి యాత్రకు రాయచూరులో జిల్లాధ్యక్షుడు బసవరాజ్ పాటిల్ ఇటగి నేతృత్వంలో కాంగ్రెస్ నేతలు బసవేశ్వర సర్కిల్ వద్ద స్వాగతం పలికారు. 34వ ఏడాది రాజీవ్ జ్యోతి యాత్ర తమిళనాడులోని పెరంబదూరుకు చేరనుంది. కార్యక్రమంలో నిర్మల, రుద్రప్ప, అరుణ్ తదితరులున్నారు.
సర్వోత్తమ సేవా
అవార్డులకు ఎంపిక
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లాలో ప్రభుత్వ సేవల్లో కొలువు దీరిన అధికారుల సేవలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి సర్వోత్తమ సేవా అవార్డులను ప్రకటించింది. ప్రజలతో మమేకమై వారి ఈతిబాధలను అర్థం చేసుకొని సేవలందించిన అంశాన్ని గుర్తించి 2025లో అవార్డులకు ఎంపిక చేశారు. రాయచూరు తహసీల్దార్ సురేష్ వర్మ, స్టాటికల్ ఉద్యోగి సంతోష్ నందిన్ని, సిరవార సీడీపీఓ నాగరత్న, జిల్లా ఖజానాలో లెక్కాధికారి వెంకటాచల, మాన్వి ఆయుష్ వైద్యాధికారి రాజేంద్ర, విద్యా శాఖ ఉద్యోగి హనుమంతరాయ, సింధనూరు గ్రంథాలయం ఉద్యోగి యల్లప్ప, మిస్కి ఉద్యోగి గురునాథ్, దేవదుర్గ టీపీ ఎఫ్‌డీసీ అమీదా బేగం, మాన్వి వ్యవసాయ శాఖాధికారి యంకణ్ణ యాదవ్‌లకు అవార్డులను అందించారు.
ధర్మస్థలపై అపప్రచారం అరికట్టండి
రాయచూరు రూరల్: ధర్మస్థలలో సామూహిక కిడ్నాప్, అత్యాచారాలు, హత్యలపై వస్తున్న అపప్రచారాన్ని అరికట్టాలని ధర్మస్థల మంజునాథ స్వామి ఆలయం భక్త బృందం డిమాండ్ చేసింది. మంగళవారం కలెక్టరేట్ వద్ద చేపట్టిన ఆందోళనలో భక్తులు మాట్లాడారు. దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడి తాలూకా ధర్మస్థలలో జరిగిన సామూహిక మరణాలపై న్యాయాంగ శాఖచే విచారణ చేపట్టాలని, సామాజిక మాధ్యమాల్లో వస్తున్న అపప్రచారాన్ని నిలపాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు.

చెరువులో పడి ఇద్దరు బాలల మృతి

చెరువులో పడి ఇద్దరు బాలల మృతి

చెరువులో పడి ఇద్దరు బాలల మృతి